Mouni Roy: లేడీ విలన్ అందాల మెరుపులు.. కవ్విస్తూ ఘోరంగా పోజులు

మోస్ట్ పాపులర్ హిందీ సీరియల్ నాగినితో ఎంతో పాపులారిటీ సంపాందించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. తర్వాత పలు చిత్రాల్లో నటించిన మౌనీ రాయ్.. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమా పవర్ ఫుల్ విలన్ పాత్రలో అలరించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల సంగతి ఒకవైపు అయితే సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ తో మరోవైపు పిచ్చెక్కిస్తుంటుంది మౌనీ రాయ్. ఈ మధ్య బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో హాట్ గా అందాలను ప్రదర్శిస్తోంది. ఇప్పుడు మరోసారి మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో అల్ట్రా గ్లామరస్ లుక్ లో కనువిందు చేసింది.

మూడు సీజన్లపాటు..

మూడు సీజన్లపాటు..

మౌనీ రాయ్​ ని హీరోయిన్ గా కంటే నాగినిగా మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి పలు సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్​ అయింది.

స్పెషల్ సాంగ్ లో నర్తించిన బ్యూటి

స్పెషల్ సాంగ్ లో నర్తించిన బ్యూటి

మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది.

రాఖీ భాయ్ తో స్టెప్పులు..

రాఖీ భాయ్ తో స్టెప్పులు..

సీరియల్స్ మాత్రమే కాకుండా రన్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ కన్నడ స్టార్ హీరో యశ్ తో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 1 లోని స్పెషల్ సాంగ్ లో రాఖీ భాయ్ తో స్టెప్పులేసింది ఈ భామ. హిందీ వెర్షన్ లో గలీ గలీ మే సాంగ్ లో ఆడిపాడి ఆకట్టుకుంది. ఇదే పాటలో తెలుగులో మిల్కీ బ్యూటి తమన్నా చేసింది.

అనేక చిత్రాలతో హవా..

అనేక చిత్రాలతో హవా..

మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్​. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది.

 హాలీవుడ్ క్యారెక్టర్ తో పోలుస్తూ..

హాలీవుడ్ క్యారెక్టర్ తో పోలుస్తూ..

ఇటీవల బాలీవుడ్ క్యూట్ కపుల్​ రణ్​బీర్​ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో లేడీ విలన్ పాత్రను మౌనీ రాయ్​ పోషించింది. ఆమె పాత్ర హాలీవుడ్​ పాత్ర వాండాను పోలి ఉందని పలు మీమ్స్​ కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ. అప్పుడప్పుడు తన అందాలను హాట్​గా ఎక్స్​పోజ్​ చేస్తూ అట్రాక్ట్​ చేస్తుంటుంది.

బ్లాక్ డ్రెస్ లో..

బ్లాక్ డ్రెస్ లో..

ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో హాట్ ఫొటోలను వదిలింది బ్యూటిఫుల్​ మౌనీ రాయ్​. మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో తన క్లీవేజ్ షోతోపాటు షోల్డర్ అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. అలాగే కవ్విస్తూ దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు మౌనీని మెచ్చుకోకుండా ఉండట్లేదు. ఇలా ఇటు హాట్ పిక్స్ తో సినిమాలతో హైలెట్ అవుతూ పాపులర్ అవుతోంది మౌనీ రాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X