Bigg Boss 17: సల్మాన్ రెమ్యూనరేషన్ లీక్.. ఏకంగా అన్ని వందల కోట్లు.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంతో తెలిస్తే!

దేశంలోని అన్ని భాషల్లోనూ సక్సెస్ అయిన ఏకైక షోనే బిగ్ బాస్. ఓ ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ హిట్ అయింది.

అలా అలా ఇప్పుడు దేశంలోని చాలా భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హిందీలో 17వ సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హోస్ట్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ లీకయ్యాయి. ఆ డీటేల్స్ మీకోసమే!

Salman Khan taking Remuneraton for Bigg Boss season 17 Hindi Show

పదహారు సీజన్లు సూపర్ హిట్: హిందీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అందుకే ఈ షో ఏకంగా పదహారు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఈ షోను కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఈ షో సెట్‌ను అతడి ఫాంహౌస్‌లోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Salman Khan taking Remuneraton for Bigg Boss season 17 Hindi Show

బిగ్ బాస్ 17వ సీజన్‌‌కు ప్లాన్: హిందీలో బిగ్ బాస్ ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పదహారు సీజన్లు ముగిసిన తర్వాత ఇప్పుడు 17వ దాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను సైతం మొదలు పెట్టేశారు. సెట్ వర్క్, కంటెస్టెంట్ల ఎంపిక తదితర అంశాలపై వాళ్లు పనులు ముమ్మరంగా చేసేస్తున్నారు.

17 మందితో.. 135 రోజుల షో: బిగ్ బాస్ హిందీ 17వ సీజన్‌ను అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఇందులోకి గతంలో మాదిరిగానే ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు, ఈ సీజన్ కూడా 135 రోజుల పాటు సరికొత్త కాన్సెప్టులతో సాగబోతుందని తెలిసింది. దీంతో ఈ సీజన్‌పైన కూడా అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.

Salman Khan taking Remuneraton for Bigg Boss season 17 Hindi Show

సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్: బిగ్ బాస్ షో చాలా భాషల్లో ప్రసారం అవుతోంది. కానీ, హిందీలో వచ్చే దానికి మాత్రం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ముఖ్యంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు భారీ మొత్తాన్నే ముట్టజెపుతూ వస్తున్నారు. ఇలా ప్రతి సీజన్‌కూ అతడి రెమ్యూనరేషన్‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ప్రారంభం కాబోతున్న 17వ సీజన్‌కు అతడు ఏకంగా రూ. 700 కోట్లు తీసుకుంటున్నాడట.

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని కోట్లా: హిందీ బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ రాబోయే 17వ సీజన్‌ కోసం ఒక్క ఎపిసోడ్‌కు రూ. 40 కోట్లు వరకూ చార్జ్ చేస్తున్నాడట. ఇలా మొత్తంగా షో పూర్తయ్యే నాటికి అతడికి రెమ్యూనరేషన్ ద్వారానే రూ. 760 కోట్లు వరకూ ఆదాయం రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. కొందరేమో అతడు రూ. 1000 కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు.

Salman Khan taking Remuneraton for Bigg Boss season 17 Hindi Show

అంత అయితే ఫ్రీగా చేస్తాను: వాస్తవానికి బిగ్ బాస్ 16వ సీజన్‌కే సల్మాన్ ఖాన్ రూ. 1000 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వచ్చింది. దీనిపై ఈ స్టార్ హీరో స్పందిస్తూ.. 'నాకు 1000 కోట్లు ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవం. అంత మొత్తం ఒక్క షోకే వస్తే.. నేను ఇంక ఏ పనీ చేయను. అందులో నాలుగో వంతు కూడా తీసుకోలేదు. ఈ వార్తలను ఈడీ శాఖ కూడా చదివింది' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X