twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోను కలిసేందుకు పెళ్లి నుంచి పారిపోయిన వధువు... సెట్స్‌లో రచ్చ రచ్చ!

    |

    సినిమా స్టార్లకు కొన్నిసార్లు అభిమానుల నుంచి ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. క్రేజీ ఫ్యాన్స్ చేసే పనులు వారిని ఆశ్చర్యానికి, ఒక్కోసారి షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా 'ఛపాక్' నటుడు విక్రాంత్ మస్సేకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఒక మహిళా అభిమాని సెట్స్‌లోకి దూసుకొచ్చి రచ్చరచ్చ చేసింది.

    ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా... సదరు మహిళ తన పెళ్లి వేడుక నుంచి పారిపోయి రావడంతో అంతా షాకయ్యారు. జూన్‌ 6న ఢిల్లీలోని సకెట్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుందట. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రిక ఆసక్తికర కథనం వెలువరించింది.

    ఏడుస్తూ నానా రచ్చ చేసింది

    ఏడుస్తూ నానా రచ్చ చేసింది

    జూన్ 6వ తేదీన సకెట్ ప్రాంతంలో ఈవినింగ్ షూటింగ్ జరిపేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఇంతలో పెళ్లి కూతురు వస్త్రధారణలో ఉన్న ఒక మహిళ సెట్స్‌లోకి దూసుకొచ్చింది. ఏడుస్తూ హీరో విక్రాంత్‌ను కలవాలంటూ గొడవ చేసింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది అందుకు నిరాకరించడంతో అక్కడి నుంచి కదలడానికి నిరాకరించింది.

    పెళ్లి ఇష్టం లేదంటూ...

    పెళ్లి ఇష్టం లేదంటూ...

    తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఈ విషయం తాను హీరోతో చెప్పుకోవాలంటూ... సెట్స్ మధ్యలో భీష్మించుకుని కూర్చుందట. ఆమె ఎంతకూ అక్కడి నుంచి కదలక పోవడంతో... చివరకు హీరో విక్రాంత్ మస్సే దిగిరాక తప్పలేదు. పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఆమెకు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను ఫిర్యాదు చేశారట.

    నాలుగు గంటలు షూటింగ్ ఆలస్యం

    నాలుగు గంటలు షూటింగ్ ఆలస్యం

    ఈ గొడవ కారణంగా నాలుగు గంటల పాటు షూటింగ్ ఆలస్యమైందట. ఈ విషయమై విక్రాంత్ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కాలేదు. నిజాయితీగా చెప్పాలంటే ఆమెకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తిరిగి పెళ్లి మండపం వద్ద వదిలేయాలని అనిపించలేదు, సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరితే చాలు' అనిపించినట్లు తెలిపారు.

    ఛపాక్ మూవీ

    ఛపాక్ మూవీ

    ఛపాక్ మూవీ విషయానికొస్తే... మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో దీపిక పదుకోన్, విక్రాంత్ మస్సే జంటగా నటిస్తున్నారు. కెఏ ప్రొడక్షన్స్, మ్రిగ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఢిల్లీ యాసిడ్ ఎటాక్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 10, 2020న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    A crazy fan disrupted the shooting of Vikrant Massey's Chhapaak film in Delhi. The woman left her wedding and rushed to Saket in Delhi, where Vikrant was shooting, just to meet the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X