న్యూడ్ గౌనులో సోనమ్ కపూర్ సెక్సీ లుక్: కేన్స్‌లో అందరి చూపు అటు వైపే!
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఆనంద్ ఆహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే అమ్మడు కేన్స్ ఫెస్టివల్‌లో వాలిపోయారు. తొలి రోజు రెడ్ కార్పెట్ వేడుకలో తన వస్త్రధారణతో పెద్దగా ఆకట్టుకోలేని సోనమ్... రెండో రోజు అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. తన శరీర రంగుతో మ్యాచ్ అయ్యే న్యూడ్ కలర్ గౌనులో దర్శనమిచ్చి అందరి మతి పోగొట్టారు. సోనమ్ ఈ డ్రెస్సులో మరింత హాట్‌గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పెళ్లి కూతురు గౌనులా...
సోనమ్ కపూర్ ధరించిన ఈ గౌను... క్రిస్టియన్ సాంప్రదాయపు వివాహాల్లో పెళ్లి కూతురు ధరించే గౌనులా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏంజిల్‌లా మెరిసిపోయింది
లూజ్ బన్ హెయిర్ స్టైల్, కను రెప్పలపై ఎల్లో కలర్ ఫినిషింగ్, దొండపండు లాంటి ఎరుపెక్కిన పెదాలతో సోనమ్ కపూర్ ఏంజిల్‌లా దర్శనమిచ్చింది.

ఇందులో భాగం కావడం ఎంతో ప్రతిష్టాతకం
ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగం కావడాన్ని తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తానని, మరోసారి ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన సోనమ్ కపూర్ తెలిపారు.

కేన్స్‌లో తన అనుభవంపై
ఉదయం 6 గంటలకే కేన్స్‌లో తన రోజు మొదలైందని, చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు సోనమ్ వెల్లడించారు.

రెడ్ కార్పెట్ లుక్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సోనమ్ కపూర్. ఎల్ ఓరియల్ అనే కాస్పొటిక్ బ్రాండ్ తరుపున ప్రచారం చేస్తున్న సోమన్ ఆ సంస్థ తరుపున ఈ వేడుకకు హాజరయ్యారు.

మరో అందమైన స్నాప్ మీ కోసం
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించి సోనమ్ కపూర్ ఫోటోల్లో ఓ బ్యూటిఫుల్ స్నాప్ అభిమానుల కోసం!


Click it and Unblock the Notifications











