కేన్స్ 2019: ఐశ్వర్యరాయ్‌ గ్లామర్ కేక.. తల్లిని అనుసరించిన ఆరాధ్య!

Recommended Video

Cannes 2019 : Aishwarya Rai Bachchan At Red Carpet In A Metallic Gold Gown || Filmibeat Telugu

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చిందంటే భారతీయులంతా ఎదురు చూసేది ఒకే ఒక్క మూమెంట్ కోసం.... ఈ సినిమా పండుగలో మాజీ విశ్వ సుందరి, మన ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ఎలాంటి డ్రెస్ వేస్తుందో... ఎలాంటి లుక్‌లో దర్శనం ఇస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు.

2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ వెయిటింగుకు ఆదివారం తెరపడింది. రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోస్తూ ఐశ్వర్యరాయ్ దర్శనమిచ్చారు. బంగారు వర్ణపు మెటాలిక్ గౌనులో ఎంట్రీ ఇచ్చిన ఆమె అందరి మతులు పోగొట్టారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ జీన్ లూయిస్ సబాజి ఈ గౌను దీన్ని డిజైన్ చేశారు.

45 ఏళ్ల వయసులోనూ గ్లామర్ కేక

45 ఏళ్ల వయసులోనూ గ్లామర్ కేక

ఐశ్వర్యరాయ్ వయసు 45 సంవత్సరాలు... ఈ వయసులోనూ తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది ఈ మాజీ ప్రపంచ సుందరి. అభిమానులను ఫిదా చేస్తూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శనం ఇచ్చారు. గోల్డెన్ ఎల్లో కలర్ మెటాలిక్ గౌనులో ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా కనిపించారు.

ఐష్ కూతురు ఆరాధ్య కూడా...

ఐష్ కూతురు ఆరాధ్య కూడా...

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా సందడి చేశారు. ఐష్ డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆరాధ్య సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌను ధరించి పిక్చర్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగించారు. ఈ తల్లీ కూతుళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సందడే సందడి..

సందడే సందడి..

ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. రెడ్ కార్పెట్ వైపు తరలి వచ్చే దారిలో కూతురుతో ఆటలాడుతూ ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది. ప్రతి ఏడాది తనతో పాటు ఆరాధ్యను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకురావడం ద్వారా ఇప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన విషయాలు నేర్పిస్తోంది.

తల్లికి తగిన కూతురు ఆరాధ్య

తల్లికి తగిన కూతురు ఆరాధ్య

ఐశ్వర్యరాయ్ మాదరిగానే ఆరాధ్య కూడా చాలా ఫాస్ట్. ఇప్పటి నుంచే ఫ్యాషన్ ప్రపంచపు పోకడలు, ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఫోటో గ్రాఫర్ల ముందు చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తోంది. భవిష్యత్తులో ఆరాధ్య అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్ మోడల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X