twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీతో వాదించలేను - నేపాల్ మ్యాప్ పై మనీషా ట్వీట్ కు, సుష్మాస్వరాజ్ భర్త ఘాటు సమాధానం

    |

    చైనా కుతంత్రంలో భాగంగా మిత్రదేశం నేపాల్ ఇటీవలే విడుదల చేసిన కొత్త మ్యాప్, ప్రస్తుతం రాజకీయవర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. దీనికి తోడు, సుప్రసిధ నటి మనీషా కొయిరాలా, తమ దేశం విడుదల చేసిన వివాదాస్పదమైన మ్యాప్ ను సమర్థిస్తూ చేసిన ట్వీట్, భారతీయులకు మింగుడుపడని విషయంగా మారింది. ఇక అమ్మడికి వ్యతిరేకంగా సోషల్ మీడయాలో ట్రోలింగ్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా క్రిమినల్ లాయర్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వారాజ్ కౌశల్ ట్విట్టర్ సాక్షిగా ఆమెను కుటుంబాన్ని ఎండగట్టేశారు.

    సరిహద్దుపై రేగిన దుమారం

    ఇటీవలే దేశ సరిహద్దున ఉన్న లిపులేఖ్, కాలాపానీ, లిమిపియాధుర భూభాగాన్ని కలుపుతూ, నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ పై భారత్ భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇది చైనా కుట్రలో భాగమని, ఆ దేశ వెన్నుదన్నుతోనే నేపాల్ ఇంతటి పనికి పూనుకుందని భారత్ వాదిస్తోంది. కాగా, నటి మనీషా కొయిరాయా చేసిన ట్వీట్, ఈ వివాదానికి అగ్గి రాజేసినట్లైంది. తమ చిన్న దేశ ఔనత్యాన్ని కాపాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దీనిపై మూడు దేశాలూ చర్చించుకుని ఓ మంచి నిర్ణయానికి రావాల్సిందిగా ఆమె ట్వీట్ చేసింది. దీంతో అసలు ఈ వివాదంలోకి చైనాను ఎందుకు లాగుతున్నారు అంటూ జనాలు ఆమెపై మండిపడుతున్నారు.

    మనీషాపై దుమ్మెత్తి పోస్తున్న భారత నెటిజన్లు

    మనీషాపై దుమ్మెత్తి పోస్తున్న భారత నెటిజన్లు

    తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టిన మనీషా అంటూ ఆమెపై ట్విట్టర్ లో దుమ్మెత్తిపోస్తున్నారు. జనాలు. ఇక, ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన స్వారజ్ కౌశాల్, మిజోరామ్ మాజీ గవర్నర్, పలు ట్వీట్ల ద్వారా భారత్ నేపాల్ బంధం గురించి వివరిస్తూ... చైనాను ఇందులో ఎందుకు చేర్చకూడదన్న విషయాన్ని ఆమెకు గట్టిగానే వివరించారు.

    Recommended Video

    'Prasthanam' Hindi Remake Trailer Is Out Now || Filmibeat Telugu

    నా కూతురు నీ ఒళ్లో కూర్చుని సినిమా చూసింది- గవర్నర్ స్వారాజ్

    నీతో నేను వాదించలేని తల్లీ అంటూ ట్వీట్ చేసిన గవర్నర్ కౌశాల్, 1942- ఏ లవ్ స్టోరీ సినిమా చూసేందుకు తమని పిలిచినప్పుడు, తాను అందుబాటులో లేనప్పటికీ, సుష్మా స్వారాజ్, తమ కూతురు భాన్సురీ ఆ సినిమాను చూసేందుకు విచ్చేశారని వివరించారు. ఆ సినిమా చూస్తున్నంతసేపూ బాన్సూరీ నీ ఒడిలోనే కూర్చుంది గుర్తుందా అంటూ ట్వీట్ చేశారు. నీ తండ్రి, ప్రకాశ్ కొయిరాలా, తల్లి సుష్మా కొయిరాలా నాకు అత్యంత ఆప్తులు, కష్ట సమయాల్లో మేం ఒకరి కొసం మరొకరం నిలబడ్డాం అంటూ గుర్తుచేశారు.

    మీ కుటుంబ క్లిష్ట సమయాలను నేను చూశాను - గవర్నర్ స్వరాజ్

    మనీషా తాతగారు బీపీ కొయిరాలా కాన్సర్ బారిన పడి ఎయిమ్స్ లో ఎడ్మిట్ అయినప్పుడు తాను ఆయన పక్కనే ఉన్నాను అంటూ ట్వీట్ చేసిన కౌశల్, అతని ముఖం కాస్తంత అయినా బెరుకు, భయం, బాధ చూడలేదని గుర్తుచేసుకున్నారు. బీపీ కొయిరాలాతో సహా, ఆయన అన్నా, తమ్ముడు అందరూ నేపాల్ ప్రధానులుగా సేవలు అందించారని తెలిపిన గవర్నరన్ కౌశాల్, ముఖ్యంగా డిప్యుటీ ప్రైమ్ మినిష్టర్ గా సేవలు అందించిన మనిషా అత్త శైలజా ఆచార్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    మీ కుటుంబ చూసిన కష్టాలు నాకు తెలుసు - గవర్నర్ స్వరాజ్

    మనీషా తాతగారు బీపీ కొయిరాలా 18ఏళ్లు జైలులో గడిపారని, కేవలం బ్రహ్మణుడిని చంపకూడదు అన్న ఆ దేశ సంప్రదాయం ప్రకారం ఆయన బతికి బయటపడిన వైనాన్ని వివరించారు. అదేవిధంగా మనీషా మేనత్త, శైలజా 26ఏళ్ల ప్రాయంలో, 8ఏళ్లు జైలు శిక్ష అనుభించిందని తెలిపారు.

    ఆపత్కాలంలో ఆదుకున్నదీ మేమే - గవర్నర్ స్వరాజ్

    ప్రకాశ్ కొయిరాలా సారధ్యంలో నేపాలీ కాంగ్రెస్ పీకల్లోతు సమస్యల్లో ఉన్నప్పుడు తాము మద్దతు ఇచ్చిన వైనాన్ని గుర్తుచేసుకున్న గవర్నల్ స్వారాజ్, జేపీ, లోహియా, చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాన్డేజ్ అహర్నిశలూ కష్టపడామని తెలిపారు. నేపాల్ ప్రజాస్వామ్యం కోసం తాము చమటోడ్చామని గుర్తుచేశారు. ఇక మనిషా అక్కడి రాజును పెళ్లాడినప్పుడు, తమకు అంతమించి ఏమీ అవసరం లేదని సంతోషించామని వెల్లడించారు. కానీ, ఎంపీగా మనిషా ఆలోచనలు తెలుసుకుని బాధపడుతున్నామని వివరించారు. ఇదంతా నేపాలీ రాజకీయాల్లో అంతర్భాగమని తెలిపారు.

    చైనాను మధ్యలోకి ఎందుకు తీసుకువచ్చావు - గవర్నర్ స్వరాజ్

    భారత్, నేపాల్ మధ్య ఏమైనా స్పర్థలు ఉంటే అవి ఇరు దేశాలూ పరిష్కరించుకోవాలి తప్ప, ఇందులోకి చైనాను ఎలా లాక్కొస్తావు అంటూ ఘాటుగానే ట్వీట్ చేశారు. అది ఇరు దేశాలకూ మంచిది కాదని స్పష్టం చేశారు. పైగా చైనాను ఈ వివాదంలోకి తీసుకురావడం ద్వారా, భారత్, నేపాల్ మధ్య ఏళ్ల బంధానికి తూట్లు పొడిచినట్లైందని విమర్శించారు. అంతేకాదు.. ప్రజాస్వామిక దేశంగా నేపాల్ ఉనికినీ ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

    English summary
    As former actress Manisha Koirala tweet goes viral and stirr controvery over Nepal's new Map,Criminal lawyer and husband of Former External Affairs minister Sushma Swaraj, Swaraj Kaushal requsts her not to get into the trouble, while recollecting his bonding with her family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X