హోలీకి ఘోర అవమానం.. వాడకూడని పదంతో పోలుస్తూ.. స్టార్ కొరియోగ్రాఫర్‌‌పై కేసు

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చావా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వధర్మం కోసం చిత్రహింసలు అనుభవించడంతో పాటు ప్రాణ త్యాగం చేసిన చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారు. విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్‌లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ , కళ్లు తుడుచుకుంటూ బయటికి వస్తున్నారు. చావా సినిమా నేపథ్యంలో హిందూ మతం, సనాతన ధర్మం, వీరుల త్యాగాలు వంటి వాటిపై చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ హిందువులు జరుపుకునే హోళీ పండుగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి, దర్శకురాలు ఫరాఖాన్.

బాలీవుడ్‌ దర్శకుడు కమ్రాన్ ఖాన్ కుమార్తె ఫరా ఖాన్. బాలీవుడ్ స్టార్స్స్ ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్‌కు ఈమె కజిన్. బాంబేలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీలో చదువుకున్న ఫరా ఖాన్‌కు లెజెండరీ మైఖేల్ జాక్సన్ అంటే ఎంతో ఇష్టం . ఆయనను స్పూర్తిగా తీసుకుని డాన్స్ నేర్చుకున్న ఆమె 1986లో జో జితా వోహి సికందర్ అనే సినిమా ద్వారా కొరియోగ్రాఫర్‌గా మారారు. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాలకు కూడా ఫరాఖాన్ పనిచేశారు. కింగ్ అక్కినేని నాగార్జున - అఖిల్ నటించిన సిసింద్రీకి ఆమె కొరియోగ్రఫి అందించారు.

case filed against Bollywood choreographer Farah Khan for controversial comments on Holi festival

బోర్డర్, ఇరువర్, బాద్ షా, దిల్ సే, దిల్ చాహ్తా హై, క్రిష్, జోష్, ఓం శాంతి ఓం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ అందజేశారు. కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ అయిన ఫరాఖాన్ జాల్వా చిత్రంలో నటించారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా ఫరాఖాన్ సేవలందిస్తున్నారు. ఫిలింఫేర్ సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆమె అందుకున్నారు.

ఇక టెలివిజన్ రంగంలోనూ ఫరాఖాన్ దూసుకెళ్తున్నారు. 2004లో ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఆమె పలు డ్యాన్స్‌, రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీ మాస్టర్ చెఫ్‌కు న్యాయ నిర్ణేతగా ఉన్న ఫరాఖాన్ ఈ కార్యక్రమంలో భాగంగా హిందువుల పండుగ హోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ అనేది ఒక చాప్రి పండుగ అని.. ఒక వర్గం వారు దానిని ఎంతో ఇష్టంగా సెలబ్రెట్ చేసుకుంటారని ఫరాఖాన్ వ్యాఖ్యానించారు.

case filed against Bollywood choreographer Farah Khan for controversial comments on Holi festival

అయతే చాప్రి అనే పదాన్ని భారతదేశంలో అవమానకరం, లేదా తక్కువ స్థాయి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వాడుతుంటారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆమె వ్యాఖ్యలు ఓ వర్గాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని , ఎంతో మందిని బాధించాయని నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అక్కడితో ఆగకుండా ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో ఫరాఖాన్‌పై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫరాఖాన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X