మతాన్ని కించపరిచిన హీరోయిన్.. కేసు నమోదు.. క్షమించండి అంటూ ట్వీట్
కామెడీ షోలో పాల్గొని అభాసుపాలైన సెలెబ్రిటీలు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా అంతగా విస్తృతి చెందలేదు. అప్పటిలా మనుషులు సున్నితంగా లేరు. ఏ చిన్న మాట మాట్లాడినా.. వాటిని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇలాంటి సమయాల్లో సెలెబ్రిటీలు ఆచితూచి మాట్లాడితే వారికే మంచింది. ఆమధ్య స్వరా భాస్కర్.. ఓ చిన్న పిల్లాడిని బూతు మాట అనేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఎంతగా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కామెడీ షోలో రచ్చ..
తాజాగా రవీనా టండన్‌కు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఆమె ఇటీవలె ఓ షోలో పాల్గొంది. అందులో బాలీవుడ్ నిర్మాత ఫర్హాన్ ఖాన్ వ్యాఖ్యాత నిర్వహిస్తోంది. ఆ కామెడీ షోలో రవీనా, కమెడియన్ భారతి సింగ్ పాల్గొన్నారు. అయితే అంతా బాగానే ఉన్న వారి ముచ్చట్లు ఓ వర్గానికి నచ్చలేదు.
హలెలూయాతో వచ్చిన చిక్కు..
హలెలూయ స్పెల్లింగ్ రాయమని టాస్క్ ఇవ్వగా.. రవీనా కరెక్ట్ రాసింది. అయితే భారతి మాత్రం తనకు వచ్చిన స్పెల్లింగ్ రాసి.. పంజాబ్‌లో అలానే రాస్తామని చెప్పుకొచ్చింది. అయితే పోనీ దాని అర్థం చెబితే మార్కులు ఇస్తామని ఫర్హాన్ ఖాన్ తెలిపింది. అయితే అది గంధీ భాత్ (బూతు) అని ఇక్కడ చెప్పుకూడదేమో అంటూ.. హెలె అంటే భర్త లూయా అంటే అదేనంటూ ఓ వెరైటి లుక్ ఇచ్చింది. దీంతో అక్కడి వారంతా పగలబడి నవ్వారు.

అర్థం చెప్పిన ఫర్హాన్..
హలెలూయా అంటే బైబిల్‌ని పదం అని, దేవుడిని పూజించేందుకు వాడుతారని అసలు అర్థాన్ని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తమ మతాన్ని కించపరిచారని కొందరు వారిపై ఫైర్ అవుతున్నారు. తమ మతాన్ని అవమానించేలా రవీనా టాండన్, ఫర్హాన్ ఖాన్, భారతి సింగ్‌లు వ్యాఖ్యలు చేశారంటూ పంజాబ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.

స్పందించిన రవీనా..
తనపై కేసు నమోదు చేయడం గురించి రవీనా ట్విటర్ ద్వారా స్పందించారు. మతానికి సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ‘ఒకరి మతాన్ని కించపరిచే విధంగా నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మేము ముగ్గురం ఎవరిని ఉద్దేశించి చర్చించుకోలేదు. మేము తెలియకుండా ఏ తప్పైనా చేసి ఉంటే నన్ను క్షమించండి.' అని రవీనా పేర్కొంది.


Click it and Unblock the Notifications











