సుశాంత్ ప్రేయసిపై కేసు నమోదు.. రియాకు చుట్టుకుంటున్న ఉచ్చు.. ఆగని ఆగ్రహజ్వాలలు
సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన దేశంలో కలకలం సృష్టించింది. సుశాంత్ మరణించి వారం రోజులు దాటినా ఆగ్రహ జ్వాలలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. సుశాంత్ మృతికి బాలీవుడ్, అక్కడి మాఫియా, సనీ పెద్దలే కారణమని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. రోజుకో రకంగా చర్చ నడుస్తోంది. నెపోటిజం, సినీ అవకాశాలు లాగేసుకోవడం, ఒంటరి చేయడం, ప్రేమ వ్యవహారం ఇలా అన్ని కలిసి సుశాంత్‌ను చంపేశాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోని నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటివారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొందరు అభిమానులు ఏకంగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
Recommended Video

సుశాంత్ మృతి..
యంగ్ హీరో సుశాంత్ సింగ్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌లోనే ఉంటూ వచ్చాడు. చివరగా గత ఆదివారం (జూన్ 14) తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఎంతో ప్రతిభ, భవిష్యత్తు ఉన్న నటుడిని పొట్టనబెట్టుకున్నారని నెటిజన్లు బాలీవుడ్‌ను దుమ్మెత్తి పోశారు.

బాలీవుడ్ పెద్దలపై ఫైర్..
సుశాంత్ మృతికి బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ, ఖాన్‌ల ఆధిపత్యంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీరి సినిమాలను బ్యాన్ చేయాలని, చూడకూడదని నిర్ణయించుకుంటున్నారు.

ఆగని ఆగ్రహ జ్వాలలు..
సుశాంత్ మరణించి వారం అవుతున్నా.. ఫ్యాన్స్, నెటిజన్స్ ఏ మాత్రం శాంతించడం లేదు. సుశాంత్‌కు న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొంతమంది బాలీవుడ్ పెద్దలపై కేసులు నమోదు చేస్తున్నారు.

రియాపై కేసు నమోదు..
సుశాంత్ ఘటనలో అతని ప్రేయసి రియా చక్రవర్తికి సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రియా పట్ల కాస్త వ్యతిరేకత ఏర్పడింది. మహేష్ భట్ వ్యవహారంతో రియాపై కోపం కట్టలు తెచ్చుకుంటోంది. అందుకే రియాపై సుశాంత్ అభిమాని కేసు వేశాడు.

అభిమాని వేసిన కేసు..
బీహార్‌లోని ముజఫర్‌కు చెందిన కుందన్ కుమార్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఆయన తరుపు లాయర్ మాట్లాడుతూ..సుశాంత్‌కు వీరాభిమాని అయిన కుందన్ అతని మరణ వార్తతో కుంగిపోయాడు. అందుకు సెక్షన్ 306, సెక్షన్ 420 కింద రియాపై కేసు వేశాడ'ని తెలిపాడు. అంతకు ముందు అడ్వకేట్ సుధీర్ కుమార్ కూడా సల్మాన్ ఖాన్, ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్‌లపై కేసు నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications











