మనో దెబ్బతిన్నాయి: వివాదంలో ‘లవ్ రాత్రి’... సల్మాన్, అతడి బావపై కేసు!

By Bojja Kumar

సల్మాన్ ఖాన్ నిర్మాతగా అతడి సొంత ప్రొడక్షన్ నిర్మిస్తున్న 'లవ్ రాత్రి' వివాదంలో ఇరుక్కుంది. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న సల్మాన్ ఖాన్, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఆయుష్ శర్మ, వరీనా హుస్సేన్, దర్శకడు ఇతరులపై.... మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

సుధీర్ ఓఝా అనే న్యాయవాది సల్మాన్ ఖాన్, లవ్ రాత్రి సినిమాకు సంబంధించిన వారిపై బీహార్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ మూవీ నవరాత్రి పండగ సందర్భంగా విడుదల చేయడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతింటున్నాయని, సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా వల్గర్‌గా ఉన్నాయని, దుర్గా మాతను అవమానించే విధంగా ఉన్నాయని తన పిటీషన్లో ఆరోపించారు.

ఈ టైటిల్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ... సినిమాలోకానీ, టైటిల్‌లో కానీ ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయడం లేదన్నారు.

Case filed against Salman Khan and Loveratri film

టైటిల్‌లో తప్పు ఏముందో అర్థం కావడం లేదు. ఇది చాలా అందమైన టైటిల్. ప్రేమ కథ చిత్రానికి అంతకంటే మంచి టైటిల్ ఉండదని నా ఉద్దేశ్యం. ఇది ఎవరి సాంప్రదాయలను, సంస్కృతిని కించ పరిచే విధంగా లేదు అన్నారు.

నవరాత్రి బ్యాక్ డ్రాపుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సంగీతం, కలర్స్, ప్రేమను సెలబ్రేట్ చేసే విధంగా సినిమా ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్లో మంచి వినోదం పంచే చిత్రం ఇది. సినిమా చూసిన తర్వాత అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని అందరి అర్థం అవుతుంది...అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X