»   » లగ్జరీ కారు కొట్టేసి బుకాయిస్తున్న ఐటమ్ భామ.. కేసు నమోదు!

లగ్జరీ కారు కొట్టేసి బుకాయిస్తున్న ఐటమ్ భామ.. కేసు నమోదు!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ కేసులో ఉరుక్కుంది. ఓ వ్యాపారవేత్త లగ్జరీ కారులో తిరుగుతూ అతడికి ఆ కారు ఇవ్వడం లేదని కేసు నమోదైంది. కిమ్ శర్మ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ఖడ్గం, మగధీర వంటి చిత్రాల్లో కూడా నటించింది. మగధీర చిత్రంలో కిమ్ శర్మ ఐటెం సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీకి అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది.

వ్యాపార వేత్త దిలీప్ కుమార్ 2017 లోనే కిమ్ శర్మపై కేసు నమోదు చేసాడు. కానీ ఆసమయంలో కిమ్ శర్మ పేరుకు బదులుగా ఆమె మాజీ భర్త పేరు ప్రస్తావించినట్లు ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీనితో మరో మారు కిమ్ శర్మపై కేసు నమోదు చేసాడు. తాను వ్యాపారవేత్తని కావడంతో ముంబైలో తనకు స్థిర నివాసం లేదని, ముంబై, రాజస్థాన్ మధ్య తిరుగుతున్న సమయంలో తన రేంజ్ రోవర్ కారుని కిమ్, ఆమె భర్త నివాసం ఉండే రెసిడెన్సీలో పార్క్ చేసేవాడినని దిలీప్ తెలిపాడు.

Case filed on bollywood beauty Kim Sharma

కిమ్ తన కారుని వాడుకుంటున్న సంగతి తెలియదని తెలిపాడు. తన కారుని తనకు తిరిగి ఇవ్వాలని కిమ్ ని కోరగా ఈ కారు తన భర్త ఇచ్చాడని, ఇవ్వడం కుదరదని అంటున్నట్లు ఆయన మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పోలీస్ లు ఆమెపై చర్య తీసుకుని తనకారు తనకు ఇప్పించాల్సిందిగా కోరినట్లు దిలీప్ కుమార్ పోలీస్ లని కోరినట్లు తెలిపాడు.

English summary
Case filed on bollywood beauty Kim Sharma. Kim Sharma not returning businessman car
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X