The Kashmir Files వాళ్లంతా స్వలింగ సంపర్కులు.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై పోలీసులకు ఫిర్యాదు

సంచలన విజయం సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ఫిర్యాదు చేశారు. భోపాల్ వాసులను ఉద్దేశించి దర్శకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దాంతో ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో వివేక్ అగ్నిహోత్రిపై పీఆర్ మేనేజర్ రోహిత్ పాండే ఫిర్యాదు చేశారు. భోపాల్ నుంచి ఫిర్యాదు చేస్తూ.. ఈ వివాదంలో ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలని విన్నవించుకొన్నారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఇటీవల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. భోపాల్ వాసులు హోమో సెక్సువల్స్ (స్వలింగ సంపర్కులు). వారు ఓ రకమైన కోరికలతో ఉంటారు అని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆయనపై భోపాల్ వాసులు భగ్గుమన్నారు.

 Case filed on The Kashmir Files Director Vivek Agnihotri over Homo sexual remarks on Bhopalis

వివేక్ అగ్నిహోత్రి మాట్లాడిన వీడియోలో.. నేను భోపాల్‌కు చెందిన వాడిని. కానీ నేను భోపాల్ వాడినని చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే భోపాల్ వాళ్లంటే ఓ రకమైన ఏహ్యత భావం ఉంటుంది. నన్ను ఎవరైనా భోపాలీ అంటే ఒప్పుకొను. ఎందుకంటే ఆ వ్యక్తి స్వలింగ సంపర్కులు. వారికి నవాబు సంస్కృతికి సంబంధించిన కోరికలతో రగిలిపోతుంటారు అని అన్నారు.

వివేక్ అగ్నిహోత్రి హోమో సెక్సువల్ వ్యాఖ్యలను పక్కన పెడితే.. ఇటీవల విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి సంచలన చిత్రంగా మారింది. ఈ సినిమా 250 కోట్ల లక్ష్యంవైపు దూసుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X