Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పోలీసుల చేతిలో బుక్కైనా పూనమ్ పాండే.. అసలేం జరిగిందంటే
పూనమ్ పాండే ఎంతగా బోల్డ్‌గా ఉంటుందో.. ఎంత బోల్డ్‌గా కనిపిస్తుందో.. ఎంత పచ్చిగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా గెలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ ప్రకటించి సంచలనం రేకెత్తించింది పూనమ్ పాండే. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. అయితే పూనమ్ మాత్రం మాటల వరకే గానీ చేతలు చేయదని తేలిపోయింది. సోషల్ మీడియాలో, వెండితెరపై ఐటెం బాంబ్‌గా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది.
ప్రత్యేకమైన యాప్‌లో..
తనకంటూ ప్రత్యేకమైన ప్రైవేట్ యాప్‌లో పూనమ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ హాట్ వీడియోలతో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పూర్తి వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలంటూ కండీషన్లు కూడా పెడుతుంది. అలా పూనమ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతూ ఉంటుంది.
హడావిడిగా పెళ్లి..
ఈ మధ్యే పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి కాస్తా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. సామ్ బాంబేను వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లింది పూనమ్ పాండే. అయితే అక్కడ పూనమ్ చేసిన రచ్చ ఓ రేంజ్లో హల్చల్ చేసింది.
భర్తపైనే ఫిర్యాదులు..
అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం కూడా జరిగింది. అలా వీరి బంధానికి ముగింపు పడింది. ఆస్తుల వివాదం కారణంగానే ఈ జంట మధ్య గొడవ జరిగిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
అలా బుక్కైంది..
తాజాగా పూనమ్ పాండేపై గోవాలో ఓ కేసు నమోదైంది. గోవాలో అసభ్యకరమైన షూటింగ్‌లు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలు, ఆ షూటింగ్‌లు హద్దులు దాటినట్టు ఉండటంతో పూనమ్‌పై గోవా మహిళా విభాగం సైతం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పూనమ్ పాండే వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.