twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసుల చేతిలో బుక్కైనా పూనమ్ పాండే.. అసలేం జరిగిందంటే

    |

    పూనమ్ పాండే ఎంతగా బోల్డ్‌గా ఉంటుందో.. ఎంత బోల్డ్‌గా కనిపిస్తుందో.. ఎంత పచ్చిగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా గెలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ ప్రకటించి సంచలనం రేకెత్తించింది పూనమ్ పాండే. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. అయితే పూనమ్ మాత్రం మాటల వరకే గానీ చేతలు చేయదని తేలిపోయింది. సోషల్ మీడియాలో, వెండితెరపై ఐటెం బాంబ్‌గా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది.

    ప్రత్యేకమైన యాప్‌లో..

    ప్రత్యేకమైన యాప్‌లో..

    తనకంటూ ప్రత్యేకమైన ప్రైవేట్ యాప్‌లో పూనమ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ హాట్ వీడియోలతో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పూర్తి వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలంటూ కండీషన్లు కూడా పెడుతుంది. అలా పూనమ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతూ ఉంటుంది.

     హడావిడిగా పెళ్లి..

    హడావిడిగా పెళ్లి..

    ఈ మధ్యే పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి కాస్తా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. సామ్ బాంబేను వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లింది పూనమ్ పాండే. అయితే అక్కడ పూనమ్ చేసిన రచ్చ ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది.

     భర్తపైనే ఫిర్యాదులు..

    భర్తపైనే ఫిర్యాదులు..

    అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం కూడా జరిగింది. అలా వీరి బంధానికి ముగింపు పడింది. ఆస్తుల వివాదం కారణంగానే ఈ జంట మధ్య గొడవ జరిగిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

    అలా బుక్కైంది..

    అలా బుక్కైంది..

    తాజాగా పూనమ్ పాండేపై గోవాలో ఓ కేసు నమోదైంది. గోవాలో అసభ్యకరమైన షూటింగ్‌లు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలు, ఆ షూటింగ్‌లు హద్దులు దాటినట్టు ఉండటంతో పూనమ్‌పై గోవా మహిళా విభాగం సైతం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పూనమ్ పాండే వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

    English summary
    Case Files against Poonam Pandey In Goa, Actor Poonam Pandey has caused yet another stir in Goa. The Goa Police on Wednesday filed an FIR against unknown people days after pictures of her provocative photoshoot at the secluded Chapoli dam site in Canacona appeared on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X