సెక్స్ రాకెట్‌లో యువ నటి.. మోడల్స్‌తో వ్యభిచారం.. హీరో మాధవన్‌తో ఉన్నట్లు!
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ద్వారా వచ్చిన మీటూ ఉద్యమం గురించి తెలిసిందే. ఎంతో మంది నటీమణులు అవకాశాల పేరిట లైంగికంగా ఇబ్బంది పెట్టారని, శారీరకంగా వాడుకున్నారని ప్రముఖులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అమ్మాయిలే కాకుండా స్టార్ హీరోలకు సైతం ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని కూడా చెప్పి ఆశ్చర్యపరిచారు.
జెండర్ తేడా లేకుండా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఓ యువ నటి.. మోడల్స్ కు సినీ అవకాశాలు ఇస్తానని నమ్మబలికి వ్యభిచారంలోకి దింపింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాల్లోకి వెళితే..

అనుమానం రాకుండా: ముంబైలో వ్యభిచార రాకెట్ ను నడుపుతుందనే ఆరోపణలో 30 ఏళ్ల ఫీమెల్ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ నటి ఆర్తి మిట్టల్ ను దిండోషి పోలుసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాల కోసం వస్తున్న మోడల్స్ కు ఆశజూపి వారితో వ్యభిచారం నిర్వహిస్తోంది ఆర్తి మిట్టల్. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ముంబైకి చెందిన సర్వీస్ బ్రాంచ్ పోలీసులు ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆర్తి దగ్గరికి పంపించారు.
ఇద్దరిని రక్షించి: సర్వీస్ బ్రాంచ్ పోలీసులు పంపిన ఇద్దరు వ్యభిచారం జరుగుతోందని నిర్ధరించుకున్న తర్వాత దాడులు నిర్వహించారు. తమతో ఉన్న ఇద్దరు మోడల్స్ ను రక్షించి.. పునరావాస కేంద్రానికి పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్నన్నింటిని కెమెరా ద్వారా పోలీసులు రికార్డ్ చేశారు. నిందితురాలు ఆర్తి హరిశ్చంద్ర మిట్టల్ సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేస్తోందని, ఓషివారాలోని ఆరాధాన అపార్ట్ మెంట్ లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.

60 వేలు డిమాండ్: ప్రాజెక్టుల పేరుతో మోడల్ లను కలిసి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఎస్సై మనోజ్ సుతార్ కు సమాచారం అందగా.. అతను ఒక టీమ్ గా ఏర్పడి ఇద్దరు ఎస్సైలను కస్టమర్స్ తరహాలో ఆర్తి మిట్టల్ దగ్గరికి పంపించాడు. ఇద్దరు అమ్మాయిలను హోటల్ కు పంపాలని వారు అడిగితే ఆర్తి రూ. 60 వేలు డిమాండ్ చేసింది. తర్వాత సుతార్ కు ఆర్తి ఇద్దరు మహిళల ఫొటోలు పంపి.. గోరేగావ్ లో ఉన్న ఓ హైటల్ కు వస్తారని చెప్పింది ఆర్తి.
రెడ్ హ్యాండెడ్ గా: అనంతరం సుతార్ హోటల్ లో రెండు గదులను బుక్ చేసి ఇద్దరు కస్టమర్లను పంపించాడు. మోడల్స్ తోపాటు ఆర్తి వచ్చినప్పుడు వారికి కండోమ్ లు కూడా ఇచ్చంది. ఆ సంఘటనలన్నింటిని కెమెరాలో రికార్డ్ చేశారు. తర్వాత వ్యభిచారం జరుగుతుందని తెలియగానే ఎస్ఎస్ బ్రాంచ్ హోటల్ పై దాడి చేసింది. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దిండోషి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.

హీరో మాధవన్ తో: ఆర్తి మిట్టల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 370తోపాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోడల్స్ కు ఆర్తి ఒక్కొక్కరికీ రూ. 15 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. కాగా.. ఆర్తి మిట్టల్ టెలివిజన్ షో అప్నాపన్ లో రాజశ్రీ ఠాకూర్ తో కలిసి పని చేసింది. అరెస్టుకు ముందు ఆమె హీరో ఆర్ మాధవన్ తో కలిసి ఓ సినిమా షూటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని సమాచారం.


Click it and Unblock the Notifications











