twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటికి వేధింపులు, అత్యాచారం... కాస్టింగ్ డైరెక్టర్‌‌కు జీవిత ఖైదు విధించిన కోర్టు!

    |

    రవీంద్రనాథ్ ఘోష్ అనే కాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పుఇచ్చింది. 23 ఏళ్ల వర్దమాన నటి, మోడల్‌ను వేధించినట్లు, అత్యాచారానికి పాల్పడ్డట్లు రుజువుకావడంతో అతడిని శిక్షిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ. 1.31 లక్షల జరిమానా విధించింది. రూ. 1 లక్షల బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని, మిగతా రూ. 31 వేలు కోర్టులో జమచేయాలని సూచించింది.

    ఆంగ్లపత్రిక కథనం ప్రకారం... రవీంద్రనాథ్ ఘోష్ బాధితురాలిని 2011లో తొలిసారి కలిశాడు. ఆ సమయంలో ఆమె ఓ ఆసుపత్రిలో పని చేస్తుండగా తనను తాను కెమెరామెన్, కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిచయం చేసకున్నాడు. తాను ఓ టెలివిజన్ సిరీస్ నిర్మిస్తున్నట్లు ఆమెతో మాటలు కలిపాడు.

    సెక్సువల్ ఫేవర్ కోరుతూ కాల్స్

    సెక్సువల్ ఫేవర్ కోరుతూ కాల్స్

    మీరు అందంగా ఉన్నారని, మీకు నటిగా రాణించాలనే కోరిక ఉంటే నేను సహాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి టీవీ షో ఆడిషన్స్ జరుగుతున్నాయని, అయితే అవకాశం కావాలంటే సెక్సువల్ ఫేవర్ చేయాలని కోరాడు. దీంతో అతడి ఫోన్ కాల్స్ పట్టించుకోవడం మానేసింది.

    రేప్ చేసి, నగ్నంగా ఫోటోస్ తీసి

    రేప్ చేసి, నగ్నంగా ఫోటోస్ తీసి

    రెండు వారాల తర్వాత అతడి ఫోన్ కాల్‌కు రెస్పాండ్ కావడంతో....ఘోష్ ఆమెను ఆమెను మద్ ఐలాండ్‌లోని లాడ్జికి రప్పించాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు, నగ్నంగా ఫోటోలు తీశాడు. 2012 ఫిబ్రవరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

    ఫోటోలు లీక్ చేస్తానని బెదిరింపులు

    ఫోటోలు లీక్ చేస్తానని బెదిరింపులు

    ఆమె నగ్న ఫోటోలు అడ్డం పెట్టుకుని తనతో సెక్సువల్ రిలేషన్ మెయింటేన్ చేయాలని ఘోష్ ఒత్తిడి పెంచాడు, లేకపోతే ఆ ఫోటోలను భర్తకు పంపుతానని బెదిరించాడు. అలా మార్చి 2012 వరకు ఆమెపై అత్యాచార పర్వం కొనసాగించాడు.

    తీవ్రమైన వేధింపులు

    తీవ్రమైన వేధింపులు

    తన వేధింపులు తగ్గాలంటే ఉద్యోగం మారాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు, పని ప్రదేశంలో కూడా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తర్వాత ఆమె వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. 2012లో తిరిగి ముంబై తిరిగి వచ్చింది. ఆ సమయంల ఆమె గర్భవతి.

    లక్ష ఇవ్వాలని డిమాండ్

    లక్ష ఇవ్వాలని డిమాండ్

    మళ్లీ ఘోష్ ఆమె వెంట పడుతూ వేధించాడు. తమ రిలేషన్ ఎండ్ అవ్వాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ డబ్బు ఇవ్వడానికి బాధితురాలు అంగీకరించింది. 2013లో ఆమె తన ఫోన్ నెంబర్ మార్చడంతో.... అతడు నగ్న ఫోటోలను బాధితురాలు పని చేస్తున్న సంస్థ యజమానికి పంపాడు.

    జైలు నుంచి కూడా బెదిరింపులు

    జైలు నుంచి కూడా బెదిరింపులు

    దీంతో 2013 డిసెంబర్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశాడు. అయితే జైలు నుంచి కూడా ఆమెను బెదిరిస్తూ ఘోష్ లెటర్స్ రాయడం ప్రారంభించాడు.

    బాధితురాలికి అనుకూలంగా తీర్పు

    బాధితురాలికి అనుకూలంగా తీర్పు

    ఘెష్, బాధితురాలి మధ్య ఉన్న రిలేషన్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. అయితే జడ్జి ఎడి డియో ఆ వాదనను తోసిపుచ్చారు. అతడికి భయపడే ఆమె అందుకు ఒప్పకుందని నిర్ధారించారు.

    English summary
    Ravindranath Ghosh, a casting director, was recently sentenced to life imprisonment by a Mumbai sessions court for raping and harassing a 23-year-old aspiring actor-model. The sessions court also imposed a fine of Rs 1.31 lakh of which the casting director will have to pay Rs 1 lakh as a compensation to the victim while the remaining 31 thousand will be deposited to the court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X