బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గల్లీ బాయ్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. సినిమాలో శృతి మించిన ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలతో పాటు బూతు పదజాలం ఎక్కువగా వాడటమే ఇందుకు కారణం.
అభ్యంతరకరంగా ఉన్న సీన్లు, సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ నిర్దాక్ష్యిణ్యంగా కత్తిరించేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ముద్దు సీన్లు బాగా ఫోకస్ చేయడం ద్వారా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. రణవీర్-అలియా మధ్య ఈ సీన్లు తొలగింపుకు గురి కావడం అభిమానులను నిరాశ పరిచే విషయమే.
ఆ సీన్ కూడా లేపేశారు, పెద్ద దెబ్బ..
ఫిబ్రవరి 8న సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ బాయ్' యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇందులో రణవీర్-అలియా మధ్య ఉండే 13 సెకన్ల హాట్ హాట్ ముద్దు సన్నివేశం తొలగించడం సినిమాకు పెద్ద దెబ్బగా చెప్పుకుంటున్నారు.
పచ్చి బూతులు..
సినిమాలో చాలా చోట్ల చెప్పడానికి వీల్లేని పచ్చి బూతు పదాలు వాడారు. ఇలాంటి పదజాలం వాడటంపై సెన్సార్ బోర్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్ చేయడం లేదా, వేరే వర్డ్స్‌తో రీప్లేస్ చేయడం కానీ చేయాలని సూచించింది.
లిక్కర్ బ్రాండ్ పేరు తొలగింపు
బ్రాండ్ పార్ట్‌నర్ నుంచి ప్రముఖ లిక్కర్ కంపెనీకి చెందిన లోగో సైతం తొలగించాలని ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సెన్సార్ బోర్డ్ చాలా సీన్లు, డైలాగులు కత్తిరించింది.
ముంబైలోని మురికివాడకు చెందిన మురాద్(రణవీర్)అనే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ‘గల్లీ బాయ్'. రాపర్ కావాలని కలలుకనే వ్యక్తి కథను దర్శకురాలు జోయా అక్తర్ తెరపై రియాల్టీ ఉట్టిపడేలా చూపించబోతున్నారట. రణవీర్ ప్రియురాలి పాత్రలో అలియా బట్ నటించింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
Zoya Akhtar's Gully Boy which received U/A certificate on February 8 has come under the scanner of CBFC. Censor Board has snipped 13 seconds of Ranveer and Alia's intimate scene and has replaced it with a wider shot. If this wasn't enough, cuss words have been replaced with milder words.
Story first published: Tuesday, February 12, 2019, 16:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more