మహిళలంటే చులకనా.. చెత్త సినిమాకు భారీ కలెక్షన్లా?.. హీరోలకు బాధ్యత లేదా? కబీర్ సింగ్‌పై రగడ

Recommended Video

CBFC Member Vani Tripathi Slams Shahid Kapoor's Kabir Singh || Filmibeat Telugu

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా విడుదలైన కబీర్ సింగ్‌ ఓ వైపు భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంటే.. మరోవైపు విమర్శకుల దాడి తీవ్రతరం అవుతున్నది. కబీర్ సింగ్ చిత్రం రిలీజ్ రోజున తొలి ఆట నుంచే సినీ విమర్శకులు తమ సమీక్షలో అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలను కించపరిచే విధంగా కబీర్ సింగ్ ఉందంటూ మహిళా క్రిటిక్స్ పెదవి విరిచారు. ఇలాంటి ప్రతికూలతలను దాటుకొంటూ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుండగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు వాణి త్రిపాఠి విరుచుకు పడ్డారు. సినిమా ఆమె లేవనెత్తిన అభ్యంతరాలు ఏమిటంటే..

 మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా

మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా

కబీర్ సింగ్ సినిమాలోని కొన్ని అంశాలు కొద్దిరోజులుగా నా దృష్టికి వస్తున్నాయి. మహిళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి. మహిళలంటే చులకన భావం, హింసాత్మక సన్నివేశాలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి అని వాణి త్రిపాఠి ధ్వజమెత్తారు. మహిళలను అంత అవహేళనగా చూపించడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు.

 చెండాలంగా ఉంది

చెండాలంగా ఉంది

కబీర్ సింగ్ చిత్రంపై అంతటితో ఆగకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత చెండాలంగా ఉండాలో అంత ఉంది. బాక్సాఫీస్ వద్ద అంత భారీగా కలెక్షన్లు ఎలా వసూలు చేస్తుందో అర్థకావడం లేదు. ఆ సినిమాకు ఉన్న ఆదరణ చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది అని వాణి త్రిపాఠి ట్వీట్ చేసింది.

స్టార్ హీరోలు అలాంటి సినిమాలా?

స్టార్ హీరోలు అలాంటి సినిమాలా?

విలువలకు కట్టుబడి సినిమాల్లో నటించే బాధ్యత ఉండాల్సిన స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తారా? దేశంలో సినిమా నిర్మాణ విలువలు దిగజారుతున్నాయా అనే ఫీలింగ్ కలుగుతున్నది. మహిళలంటే సినిమాల్లో ఆట వస్తువులుగా మారిపోతుండటంత దారుణం. సినిమాలో మహిళల క్యారెక్టర్లను డిజైన్ చేస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉందంటూ వాణి త్రిపాఠి మరో ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది.

 హీరోది తప్పా? ఒప్పా?

హీరోది తప్పా? ఒప్పా?

తన ట్వీట్లను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నిస్తున్న వారిపై వాణి త్రిపాఠి స్పందించారు. ఓ హీరో అలాంటి పాత్రను ఎంచుకొంటే తప్పేమిటి అని అడుగుతున్నారు. అయితే తప్పు లేదా ఒప్పు ఇక్కడ ప్రశ్న కాదు. నీవు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నావో అది నీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని అంటాను. క్యారెక్టర్ అనేది కేవలం కాగితానికి సంబంధించింది. యాక్టర్ అనే వ్యక్తి అందులో జీవించకూడదు అని వాణి అభిప్రాయపడింది.

 రూ. 100 కోట్ల దిశగా

రూ. 100 కోట్ల దిశగా

బాలీవుడ్ తారలు షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన కబీర్ సింగ్ చిత్రం జూన్ 21 తేదీన విడుదలైంది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.82 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీగా ఆదరణ దక్కుతున్నది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X