దిశా సలియాన్ కేసులో ట్విస్టు.. సుశాంత్ మృతితో లింకుపై.. రంగంలోకి సీబీఐ

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌ మరణంలో వాస్తవాలను రాబట్టడానికి రంగంలోకి దిగిన సీబీఐ తమ దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ కేసుతో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్‌ మరణానికి లింకు ఉందనే ఆరోపణలు కొద్దికాలంగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణం కేసులో సీబీఐ కీలక ఆధారాలు సంపాదించినట్టు ముంబై మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై పోలీసు అధికారిపై వేటు పడినట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

జూన్ 8వ తేదీన 14 అంతస్తుల భవనం నుంచి

జూన్ 8వ తేదీన 14 అంతస్తుల భవనం నుంచి

పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ జూన్ 8 తేదీన మలాడ్‌లోని 14 అంతస్తుల భవనం నుంచి దూకి మరణించారనే వార్త బాలీవుడ్‌లో కలకలం రేపింది. అయితే ఆమె మరణం తర్వాత సుశాంత్ సింగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వాళ్లు తనను కూడా వదలరు అంటూ అన్నట్టు సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మిత పారిఖ్ టెలివిజన్ చర్చలో వెల్లడించింది.

సుశాంత్ మృతి కేసుతో దిశా మరణం లింకు

సుశాంత్ మృతి కేసుతో దిశా మరణం లింకు


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో భాగంగా దిశా సలియాన్ కేసుపై కూడా దృష్టిపెట్టనున్నాం. సుశాంత్ మరణానికి దిశా సలియాన్ మృతికి లింకు ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. నిజంగానే ఈ ఇద్దరి మరణాలకు ఏదైనా లింకు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తాం అని సీబీఐ వర్గాలు వెల్లడించినట్టు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.

దిశ సలియాన్ కేసు దర్యాప్తు అధికారిపై వేటు

దిశ సలియాన్ కేసు దర్యాప్తు అధికారిపై వేటు


ఇక దిశా సలియాన్ మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఆమె కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిపై వేటు వేస్తూ ముంబై పోలీసుల ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. గత దర్యాప్తు అధికారిని మార్చివేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించడం చర్చనీయాంశమైంది.

నాకు కేసుతో సంబంధం లేదు

నాకు కేసుతో సంబంధం లేదు


దిశా సలియాన్‌ కేసును గతంలో దర్యాప్తు చేస్తున్న అధికారి వినోద్ కనాజేను సంప్రదించగా.. ప్రస్తుతం నేను ఆ కేసును పరిశీలించడం లేదు. నాకు ఈ కేసుతో సంబంధం లేదు. రాజానే సార్ అనే అధికారికి ఈ కేసు దర్యాప్తును అప్పగించారని చెప్పినట్టు రిపబ్లిక్ టీవీ తన కథనంలో ప్రచురించింది.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
దిశా సలియాన్ ఫ్రెండ్‌ను విచారించిన సీబీఐ

దిశా సలియాన్ ఫ్రెండ్‌ను విచారించిన సీబీఐ


అయితే తాజా సమాచారం ప్రకారం.. దిశా సలియాన్ కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో బాలీవుడ్ టాలెంట్ మేనేజర్ ఉదయ్ సింగ్ గౌరిని కొద్ది రోజుల క్రితం ప్రశ్నించినట్టు సమాచారం. దిశాకు సన్నిహితురాలైన ఉదయ్ సింగ్ గౌరీ జూన్ 13న సుశాంత్‌తో మాట్లాడినట్టు కాల్ డేటాలో స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X