twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిసార్ట్‌‌లో రియా గూడుపుఠాణి.. సుశాంత్ మూడు నెలలు నిర్బంధం.. రంగంలోకి సీబీఐ!

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకొన్న విషయాలను సీబీఐ నిశితంగా పరిశీలిస్తున్నది. అవసరమైన ప్రతీ విషయాన్ని విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నది. మానసిక రుగ్మతకు గురైన సుశాంత్‌ను ముంబైకి సమీపంలోని ఓ రిసార్టులో అధ్యాత్మిక గురువు చేత చికిత్స అందించారనే వార్తలు వస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు ఆ రిసార్టు గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విచారణ వివారాల్లోకి వెళితే..

    Recommended Video

    Rhea Charkraborty took Sushant to a Waterstone resort near the Mumbai airport
    అధ్యాత్మిక గురువ పర్యవేక్షణలో చికిత్స

    అధ్యాత్మిక గురువ పర్యవేక్షణలో చికిత్స

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌కు గురయ్యారనే రియా చక్రవర్తి సూచన మేరకు తాను బాలీవుడ్ హీరోకు అధ్యాత్మిక పద్దతుల్లో చికిత్స అందించాను. ఎక్కువ శాతం సుశాంత్ ఆరోగ్యం, మానసిక రుగ్మత గురించి రియానే నాతో సంభాషించింది. సుశాంత్‌ డిప్రెషన్‌ను నయం చేయడానికి నేను సహకరించాను అని అధ్యాత్మిక వైద్యుడు మోహణ్ జోషి ఇటీవల పేర్కొన్నారు.

    ముంబైలోని వాటర్‌స్టోన్ రిసార్టులో

    ముంబైలోని వాటర్‌స్టోన్ రిసార్టులో

    గత నవంబర్‌లో సుశాంత్ వైద్యం కోసం రియా చక్రవర్తి తన కుటుంబంతో కలిసి వాటర్‌స్టోన్ రిసార్ట్‌ను సందర్శించారు. గతేడాది నవంబర్ 21 నుంచి 23 వరకు సుశాంత్‌ను రిసార్టులో అధ్యాత్మిక గురువును కలుసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే సుశాంత్ కుటుంబానికి దూరమయ్యారు. ఆ తర్వాతే సుశాంత్ బిజినెస్ వ్యవహారాలన్నీంటిని వారి ఆధీనంలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆయన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా బ్రష్టుపట్టారు అని సుశాంత్ బావ ఆరోపించారు.

    రియా, ఫ్యామిలీపై అనుమానాలతో

    రియా, ఫ్యామిలీపై అనుమానాలతో


    రియా ఆమె ఫ్యామిలీపై చెలరేగుతున్న ఇలాంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సీబీఐ బృందంలో ముంబై విమానాశ్రయానానికి సమీపంలోని మారోల్‌లో ఉన్న వాటర్‌స్టోన్ రిసార్టుకు సీబీఐ అధికారుల బృందం వెళ్లింది. అధ్యాత్మిక గురువు మోహన్ జోషిని సుశాంత్‌కు చేసిన చికిత్స గురించి అడిగి తెలుసుకోనున్నారు.

    ఫోరెన్సిక్ నిపుణులు, ముంబై పోలీసులతో

    ఫోరెన్సిక్ నిపుణులు, ముంబై పోలీసులతో


    సుశాంత్ కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు గురువారం నుంచి ముంబైలో విచారణ మొదలుపెట్టారు. తొలుత ఫొరెన్సిక్ నిపుణులతో, అలాగే ముంబై పోలీసులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సుశాంత్ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా, వంటమనిషి నీరజ్‌ను విచారించారు. ఆ తర్వాత కూపర్ హాస్పిటల్‌లో నిర్వహించిన పోస్టు మార్టమ్ నివేదికలను వైద్యుల నుంచి తీసుకొన్నారు.

    ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో సుశాంత్ రిపోర్టులు

    ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో సుశాంత్ రిపోర్టులు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించడానికి, క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌ వైద్యుల సహకారాన్ని సీబీఐ అధికారులు తీసుకొనున్నారు. అలాగే సుశాంత్ ఇంటిలో క్రైమ్ సీన్ రీక్రేయషన్ తర్వాత మళ్లీ సిద్ధార్త్ పితాని, నీరజ్‌ను విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Sushant Singh Rajput’s neighbour reveals that his home lights were unusually off on June 13th. Sushant's brother in law allages that Rhea Charkraborty and family took him to a Waterstone resort near the airport and kept him there for months. healing for Sushant Singh Rajupt in Waterstone resort.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X