twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేరస్థులకు సింహ స్వప్నం మనోజ్ శశిధర్.. పవర్‌ఫుల్ అధికారి చేతికి సుశాంత్ కేసు!

    |

    దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలకు తెరలేపిన సుశాంత్ సింగ్ రాజ్ మరణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. దీంతో ముంబై పోలీసుల దర్యాప్తకు ఇక తెరపడినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీబీఐకి అన్ని రకాల సహకారం అందించాలని ముంబై పోలీసులకు సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో సుశాంత్ కేసు దర్యాప్తు అంశం సీబీఐ జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్‌కు అప్పగించడంపై అన్ని వర్గాల్లోనూ, బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది. ఎవరీ మనోజ్ శశిధర్ అంటే..

    Recommended Video

    Sushant's Case CBI Investigation:పవర్‌ఫుల్ CBI అధికారి చేతికి సుశాంత్ కేసు, క్రైమ్ సీన్ రీ క్రియేట్
    ముగ్గురు సభ్యులతో కలిపి సిట్

    ముగ్గురు సభ్యులతో కలిపి సిట్

    సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సుశాంత్ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ ముగ్గురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి మనోజ్ శశిధర్ నాయకత్వం వహిస్తారనే వెల్లడించింది. మనోజ్‌తోపాటు డీఐజీ గగన్ దీప్ గంభీర్, ఎస్పీ నుపూర్ ప్రసాద్; డీఎస్పీ అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిసింది.

    గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1994 ఆఫీసర్

    గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1994 ఆఫీసర్

    మనోజ్ శశిధర్ గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జాతీయ స్థాయి దర్యాప్తు బృందాల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేయడమే కాకుండా కీలక కేసులను పరిష్కారం చూపిన అనుభవం ఉంది. నిజాయితీ, ధైర్యం, చురుకైన అధికారిగా గుర్తింపు పొందారు. పలు కేసుల్లో నేరస్థులకు సింహస్వప్నంగా మారారనే పేరు కూడా సంపాదించుకొన్నారు.

    గుజరాత్‌లో పలు జిల్లాల్లో..

    గుజరాత్‌లో పలు జిల్లాల్లో..

    గుజరాత్‌లో ఐబీ, వడోదర పోలీస్ కమిషనర్‌గా, ఆహ్మదాబాద్ క్రైం బ్రాంచ్‌లో డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా, ఆహ్మాదాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. గుజరాత్‌లో ఐదు జిల్లాలకు ఎస్పీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్యంలో, అమిత్ షా సభ్యులుగా ఉన్న అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏపీసీ)కి నాయకత్వం వహించారు.

    ఆగస్టు 20న టీమ్‌తో కలిసి ముంబైకి

    ఆగస్టు 20న టీమ్‌తో కలిసి ముంబైకి

    సిన్సియర్ అధికారి మనోజ్ శశిధర్ నేతృత్వంలో సీబీఐ బృందం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును దర్యాప్తు చేయడానికి గురువారం ముంబైలో అడుగుపెడతున్నారు. ముంబైలో అడుగపెట్టిన అనంతరం పోలీస్ కమిషనర్‌తో సమావేశం అవుతారు. ఆయన నుంచి కేసు డైరీని తీసుకొని దర్యాప్తు తీరును పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కేసును దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.

    క్రైమ్ సీన్ రీ క్రియేట్, ఫోరెన్సిక్ రిపోర్టులపై దృష్టి

    క్రైమ్ సీన్ రీ క్రియేట్, ఫోరెన్సిక్ రిపోర్టులపై దృష్టి

    సుశాంత్ కేసు విచారణలో భాగంగా రంగంలోకి దిగే సీబీఐ అధికారులు క్రైమ్ సీన్‌ను రీ క్రియేట్ చేస్తారని, క్రైమ్ సీన్‌కు సంబంధించిన ఫోటోలు తీసుకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక తిరిగి పంచనామా కూడా నిర్వహిస్తారని, అలాగే ఫోరెన్సిక్ రిపోర్టుల వివరాలు తనిఖీ చేస్తారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

     సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ హర్షం

    సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ హర్షం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును మనోజ్ శశిధర్‌కు అప్పగించిన నేపథ్యంలో అసలు విషయాలు బయటకు వస్తాయని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై సుశాంత్ అభిమానులు, సన్నిహితుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఈ కేసు దర్యాప్తును మహారాష్ట్ర బీజేపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు.

    English summary
    Supreme Court verdict has reveal that CBI will investgate the Sushant Singh Rajput case. SC has pronounced the verdict that CBI will investigate the Sushant Singh Rajput case furthur. CBI Joint director Manoj Shashidhar to lead the three member of CBI team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X