సుశాంత్, దిశ మరణాల వెనుక భాయ్.. తెరపైకి టాప్ బిల్డర్, రాజకీయ నేత, ఇద్దరు హీరోల పేర్లు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశ సలియాన్ మరణాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ కేసు రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతూ సంచలనం రేపుతున్నది. ఈ క్రమంలో దిశ, సుశాంత్ మరణాల వెనుక ముంబైలో టాప్ హీరోలకు సన్నిహితుడైన టాప్ బిల్డర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ టాప్ బిల్డర్‌ను ప్రశ్నించేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నట్టు బాలీవుడ్‌లో మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇంకా ఈ వ్యవహారంలో బయటకు వచ్చిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : Sushant,దిశ మరణాల వెనుక టాప్ బిల్డర్.. అసలేం జరిగిందంటే..? || Oneindia Telugu
పరారీలో టాప్ బిల్డర్

పరారీలో టాప్ బిల్డర్

బాలీవుడ్‌ తారలకు డ్రగ్స్ రాకెట్ లింకులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేపట్టిన తర్వాత ప్రముఖ బిల్డర్ పరారీలో ఉన్నారు. టాప్ బిల్డర్‌కు భాయ్‌తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ నేతలు, సినీ తారలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెరపైకి వచ్చింది.

దిశ మరణానికి ముందు పార్టీలో ఇద్దరు హీరోలు

దిశ మరణానికి ముందు పార్టీలో ఇద్దరు హీరోలు

దిశా సలియాన్ మరణానికి అదే రోజు ముంబైలో నిర్వహించిన పార్టీ వివాదాస్పదమైన నేపథ్యంలో ఎన్సీబీ టాప్ బిల్డర్‌పై దృష్టిపెట్టారు. ఆ పార్టీని నిర్వహించింది టాప్ బిల్డరే. ఆ పార్టీలో దిశా సలియాన్‌కు గొడవ జరగడం కూడా ఆమె మరణానికి కారణమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో బిల్డర్, ప్రముఖ రాజకీయ నేత, ఇద్దరు హీరోలు, వారి సోదరులు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

 టాప్ బిల్డర్‌ను విచారిస్తాం

టాప్ బిల్డర్‌ను విచారిస్తాం

దిశా సలియాన్ మరణానికి ముందు జరిగిన పార్టీ గురించి విచారించేందుకు త్వరలోనే బిల్డర్‌ను సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా అందుబాటులో లేనందున్న బిల్డర్‌ను విచారించలేదు. కోవిడ్19 కూడా ఓ కారణం. అందుకే ఈ కేసు దర్యాప్తు కాస్త నెమ్మదించింది అని సీబీఐ అధికారులు వెల్లడించినట్టు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.

 సీబీఐ బృందంలో అధికారికి కరోనావైరస్

సీబీఐ బృందంలో అధికారికి కరోనావైరస్

ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్లో ఒకరికి కరోనావైరస్ సోకింది. బుధవారం అధికారికి యాంటిజెన్ టెస్ట్ జరిపితే ఆయనకు పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. దాంతో బుధవారం శృతిమోడీని విచారించకుండానే వెనుకకు పంపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X