సీబీఐకి సుశాంత్ కేసు సంచలనం: #CBIForSSRకి రికార్డు ట్వీట్లు.. 13 దేశాలు, 5 ఖండాల మద్దతు
సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు చేపట్టి దర్యాప్తుపై సినీ ప్రేక్షకులకు, ప్రముఖులు, వివిధ వర్గాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముంబై పోలీసుల చేస్తున్న దర్యాప్తుతో ఎలాంటి ప్రయోజనం లేదని, దివంగత హీరో మరణం కేసును సీబీఐకి అప్పగించాలని ఇటీవల ఆన్‌లైన్ ఉద్యమం ప్రారంించారు. #CBIForSSR అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఉద్యమానికి ఐదు ఖండాల నుంచిఅనూహ్యమైన మద్దతు లభిస్తున్నది. ఈ ఉద్యమం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదంటే..
Recommended Video

సుశాంత్ సింగ్ సోదరి ఉద్యమం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేత సింగ్ కృతి ఓ ఫోటోను, హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే, కంగన రనౌత్, అనుపమ్ ఖేర్, వరుణ్ ధావన్, పరిణితి చోప్రా, కృతి సనన్, జియా ఖాన్ తల్లి రిబియా ఖాన్ లాంటి తారలు మద్దతు ప్రకటించారు. సుశాంత్ అభిమానులు ఈ ఉద్యమంలో భాగం కావడంతో రికార్డు స్థాయి ట్వీట్లతో ట్రెండింగ్‌గా మారింది.

ట్విట్టర్ యుద్ధానికి రికార్డు ట్వీట్లు
గత నాలుగు రోజులుగా ట్విట్టర్‌లో సాగుతున్న ఉద్యమానికి అనూహ్యమైన మద్దతు లభించింది. ఇప్పటి వరకు 27,81,707 ట్వీట్లు లభించాయి. ఈ మొత్తంలో 44 శాతం అంటే 12,25,778 ట్వీట్లు భారతీయ నెటిజన్ల నుంచి రావడం విశేషం. మిగితా 15 లక్షలకుపైగా ట్వీట్లు విదేశాల నుంచి లభించాయి. ఇంకా భారీగా ఈ ట్వీట్ల ఉద్యమం పెరిగే అవకాశం ఉంది.

13 దేశాల మద్దతు.. 5 ఖండాల నుంచి ట్వీట్లు
సుశాంత్ మరణంలో వాస్తవాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ చేస్తూ #CBIForSSR హ్యాష్ ట్యాగ్‌కు వివిధ దేశాల నుంచి మంచి స్పందన కనిపించింది. భారత్‌తోపాటు పలు ఆసియా దేశాలు, నార్త్ అమెరికా, ఆఫ్రికా, యూరప్ లాంటి ఖండాల నుంచి సుమారు 13 దేశాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభించింది.

దేశాల వారీగా వచ్చిన ట్వీట్లు
భారత్ నుంచి 12,25,778 ట్వీట్లు వస్తే.. ఆ తర్వాత అమెరికా నుంచి 5.5 లక్షల ట్వీట్లు, ఆస్ట్రేలియా నుంచి సుమారు 2 లక్షల ట్వీట్లు, కెనడా నుంచి 1.6 లక్షల ట్వీట్లు, బంగ్లాదేశ్, నేపాల్; సింగపూర్, శ్రీలంక, పాకిస్థాన్, మలేషియా, మారిషస్, న్యూజిలాండ్ నుంచి తలా 20 వేల ట్వీట్లు లభించాయి. పలు దేశాల్లో సుశాంత్ అభిమానుల హోర్డింగులు పెట్టి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

త్వరలోనే సుప్రీం నిర్ణయం
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని తండ్రి కేకే సింగ్ సుప్రీంకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలా? వద్దా? అనే విషయంపై సుప్రీం కొద్దిరోజుల్లోనే నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆన్‌లైన్ ఉద్యమం అత్యంత కీలకంగా మారింది. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనే విషయాన్ని కొన్ని వర్గాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











