twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ బాస్టర్డ్‌తో పోరాడు, సోనాలి బింద్రే కోసం సెలెబ్రిటీల ప్రార్థనలు.. స్పందించిన నాగార్జున!

    |

    Recommended Video

    Celebrities Prays For Sonali Recovery

    సోనాలి బింద్రే తెలుగులో నటించింది 6 చిత్రాల్లో మాత్రమే. కానీ అందులోనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు ఉన్నాయి. మురారి, ఇంద్ర, మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సోనాలి నటించింది. ఈ అందాల తార కేన్సర్ బారిన పడడం బాధాకరం. తనకు హై గ్రేడ్ క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయిందని సోనాలి బింద్రే ఇటీవల తెలిపింది. సోనాలి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. ఆమె కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె క్యాన్సర్ ని జయించేలా ధైర్యాన్ని ఇస్తున్నారు. సోనాలి కోలుకోవాలని ప్రముఖుల మెసేజ్ లు ఇప్పుడు చూద్దాం.

    స్పందించిన నాగార్జున

    క్యాన్సర్ నుంచి నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. క్యాన్సర్ ని జయించే ఆత్మ స్థైర్యం నీకు కలగాలి అని నాగార్జున ట్విట్టర్ లో స్పదించారు. నాగార్జున, సోనాలి బింద్రే కలసి మన్మధుడు చిత్రంలో నటించారు.

    నీ కోసం ప్రార్థిస్తున్నా

    బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ సోనాలి కోసం ట్వీట్ చేశాడు. ఈ వార్త వినగానే చాలా బాధ కలిగింది. త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ రితేష్ పేర్కొన్నాడు.

    ఓడిపోయేది క్యాన్సరే

    నీవు ఎంతటి బలమైన మహిళవో నాకు తెలుసు. నటిగా, రచయితగా, తల్లిగా రాణించావు. ఈ పోరాటంలో తప్పకుండా క్యాన్సర్ ఓడిపోతుంది. మా ప్రేమ ఎప్పుడూ నీకు ఉంటుంది అని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నాడు.

    ఆ బాస్టర్డ్‌ని ఓడించు

    సోనాలి బింద్రే క్యాన్సర్ పట్ల అర్జున్ కపూర్ ఎమోషనల్ గా స్పందించాడు. ఆ బాస్టర్డ్ ని గెలవనీయకు.. పోరాడు అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Celebrity prayers for Sonali Speed recovery. Nagarjuna good wishes to his co star
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X