స్టార్ హీరోకు సెన్సార్ బోర్డ్ షాక్.. శివుడి పాత్రను మార్చేయాలంటూ ఆదేశం
ఓ మై గాడ్.. అవును, ఓ సినిమా యూనిట్ ఓ మై గాడ్ అనేలా పెద్ద ఝలక్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలోని ప్రధాన పాత్ర అయిన శివుడినే మార్చేయాలంటూ సూచనలు చేసింది. దీంతో మేకర్స్ ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు.
సెన్సార్ బోర్డ్ ఇచ్చిన ఆదేశంతో దర్శకనిర్మాతలు ఏమనుకున్నారో అదే. 'ఓ మై గాడ్ 2' (Oh My God 2/OMG 2). 2012లో వచ్చిన ఓ మై గాడ్ (OMG) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి సీక్వెల్ గా వస్తున్న మూవీనే ఓ మై గాడ్ 2 (OMG 2). ఇందులోని స్టార్ హీరోకే తాజాగా సెన్సార్ బోర్ట్ షాక్ ఇచ్చింది.

మార్చుకునేందుకు: బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందిన అక్షయ్ కుమార్ సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులకు రియల్ వినోదాన్ని పంచుతుంటాడు. రియల్ స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటాడు. సినిమా కోసం తనను ఎలా మార్చుకోవడానికైన సిద్ధపడతాడు. అలాంటి బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.

దాంతో బిజీ: హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ పేరు ముందుగా చెప్పుకోవాల్సిందే. ఇటీవల బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు, సెల్ఫీ వంటి చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు ఈ యాక్షన్ హీరో. ప్రస్తుతం బడే మియా చోటే మియా సినిమాతో బిజీగా ఉన్నాడు.
బ్రేక్ వేసిన బోర్డ్: బడే మియా ఛోటే మియా సినిమా చిత్రీకరణలో ఉండగా ఓ మై గాడ్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్ కుమార్. అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ తెగ క్యూరియాసిటీ పెంచేశాయి. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజుకు రెడీగా ఉంది. ఈ సమయంలో సినిమాకు సెన్సార్ బోర్డ్ బ్రేక్ వేసి షాక్ ఇచ్చింది.

పూర్తిగా మార్చేయాలి: ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పిలీం సర్టిఫికేషన్ (CBFC/సెన్సార్ బోర్డ్) కోసం వెళ్లిన ఓ మై గాడ్ 2 సినిమాకు ఏకంగా 20 కట్స్ విధించింది. అలాగే A సర్టిఫికేట్ జారీ చేసింది. 20 సన్నివేశాల్లో మార్పు చేయాలని, వాటిలో ఆడియో, వీడియోకు సంబంధించిన సీన్లు కూడా ఉన్నట్లు తెలిపింది. వీటన్నిటికి మించి మెయిన్ రోల్ అయిన అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పూర్తిగా మార్చేయాలని సూచించింది.
అలా చూపించాలి: శివుడి పాత్రను మార్చేసి ఓ దూతగా చూపించాలని సలహా ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో చేసేది లేక సినిమాను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. గత వారమే ఈ మార్పులు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ సినిమా యూనిట్ కు సూచనలు జారీ చేసింది. ఇక దీనికితోటు ఓ మై గాడ్ 2 మూవీ ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంది.

గోపాల గోపాల: ఇదిలా ఉంటే ఓ మై గాడ్ 2 సినిమాలో అక్షయ్ కుమార్ తోపాటు పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ మరో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను వియాకాం 18 స్టూడియోస్ రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ మూవీ ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్. దీన్ని తెలుగులో గోపాల గోపాలగా రీమేక్ చేశారు.


Click it and Unblock the Notifications











