త్రిప్తి దిమ్రికి బ్యాడ్ న్యూస్.. ఈ సీన్లు లేపేయండి అంటూ వార్నింగ్
ఒక్క సినిమా చాలు ఓవర్ నైట్ లో ఎవరి ఫేట్ అయ్యినా ఒక్కసారిగా మారిపోవడానికి. మరి అలాంటి ఒక్క అవకాశం ఒక్క సినిమా కోసమే కొందరు నటీనటులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ మన తెలుగులో చాలా మంది యువ హీరో హీరోయిన్స్ తమ లైఫ్ ని సెట్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే బాలీవుడ్ మార్కెట్ లో ఓవర్ నైట్ స్టార్డం తెచ్చుకోవడం అనేది చాలా తక్కువే జరుగుతుంది.
అక్కడ ఉండే పోటీ స్టార్లు నటీనటుల నడుమ ఓ యువ హీరోయిన్ కి స్టాడం రావడం అంటే అది ఇంకా కష్టం కానీ ఒక్క సినిమాతో యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి బాలీవుడ్ లో జాక్ పాట్ కొట్టేసింది. మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కాంబినేషన్ లో చేసిన "ఆనిమల్" సినిమాలో త్రిప్తి దిమ్రి కూడా నటించింది. సినిమాలో ఎప్పుడో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సర్ప్రైజ్ ప్యాకింగ్ గా కనిపించి ఒక్కసారిగా స్టార్ అయ్యిపోయింది.

ఈ సినిమా తర్వాత ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ కూడా భారీ లెవెల్లో పెరిగారు. దీనితో బాలీవుడ్ లో మంచి హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ గా మారిపోయిన ఈమె ఇప్పుడు ఆ స్టార్డం కాపాడుకోడానికి అలాంటి తరహా సినిమాలే ఓకే చేస్తుంది. కాగా అలా ఆమె చేసిన లేటెస్ట్ బోల్డ్ సెన్సేషనల్ సినిమానే "బ్యాడ్ న్యూజ్". దర్శకుడు ఆనంద్ తివారి టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ తో చేసిన ఈ చిత్రం కొన్ని రోజులు కితమే ఓ హాట్ సాంగ్ తో ఇంటర్నెట్ ని షేక్ చేసింది.
దీనితో మరోసారి త్రిప్తి దిమ్రి రెచ్చిపోయింది అంటూ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ మొదలు కాగా ఈ సినిమా ఈ జూలై 19 రిలీజ్ కి సిద్ధం అయ్యింది. కాగా ఇంకా రెండు రోజులు గ్యాప్ ఉంది అనగా సెన్సార్ కి వెళ్లిన ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ షాకిచ్చారు. ఈ సినిమాలో ఆల్రెడీ బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయని అర్ధం అయ్యింది. కాగా అందులో మొత్తం మూడు హాట్ సీన్స్ ని అయితే తప్పకుండా తొలగించాలని సెన్సార్ వారు చెప్పారట.

తొలగించడమో లేదో వాటిని మోడిఫై చేసి అటాచ్ చెయ్యాలని సూచించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి సెన్సార్ వారే అభ్యంతరం చెప్పే రేంజ్ లో ఈ సినిమాలో సీన్స్ ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ సినిమాని బాలీవుడ్ లో చాలా మంది పట్టించుకోరు అనుకున్నారు కానీ దీనికి ఇప్పుడు సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి వారి సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమా బుకింగ్స్ ఇంకా రిలీజ్ కి ముందే బాగున్నట్టుగా చెబుతున్నారు.
మరి బాలీవుడ్ లో ఈ సినిమా హిట్ బాట పడుతుందో లేదో చూడాలి. కాగా ఈ అమ్మడు ఇపుడు బాలీవుడ్ హారర్ కామెడీ సీక్వెల్ చిత్రం భూల్ భులైయా 3 లోని అలాగే ధఢక్ 2 అనే సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటుగా సెన్సేషనల్ సీక్వెల్ ఆనిమల్ 2 లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. వీటితో అయితే ఇంట్రెస్టింగ్ త్రిప్తి దిమ్రి రానున్న రోజుల్లో సీక్వెల్స్ లోనే కనిపించనుంది అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











