మళ్లీ పెళ్లిచేసుకోను.. కాకపోతే సహజీవనానికి రెడీ.. డేటింగ్ రూమర్లపై యంగ్ హీరోయిన్
బాలీవుడైనా, టాలీవుడ్ అయినా సినీ తారలపై రూమర్లు రావడంలో కొత్తేమీ లేదు. కాకపోతే స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయం గత నాలుగైదు రోజులుగా మీడియాలో విసృతంగా ప్రచారమవుతున్నది. అయితే వారిద్దరూ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు మికా సింగ్, టెలివిజన్ నటి చాహత్ ఖన్నా. తమపై వస్తున్న రిలేషన్‌షిప్ రూమర్లపై వారిద్దరు స్పందిస్తూ..

బాలీవుడ్, టెలివిజన్ రంగంలో
చాహత్ ఖన్నా బాలీవుడ్ లోనూ, టెలివిజన్ రంగంలోనూ రాణిస్తున్న నటి. తన 16వ ఏటనే టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. తాజాగా ప్రస్థానం, థ్యాంక్యూ, ఏక్ మై ఏక్ తుమ్ లాంటి సినిమాల్లో నటించింది. భరత్ నర్సింగానీని 2006లో వివాహం చేసుకొన్నది. అయితే కొద్ది నెలలకే దాంపత్య జీవితానికి వారిద్దరూ గుడ్‌బై చెప్పారు. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆమెకు, మ్యూజిక్ డైరెక్టర్ మికా సింగ్‌కు సంబంధాలు అంటగట్టారు.

మికా సింగ్‌తో మ్యూజిక్ ఆల్బమ్
మికా సింగ్‌తో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తున్నాం. దాని కోసం క్వారంటైన్‌లోనే ఉంటూ ఆ పనులు చేసుకొంటున్నాం. అయితే తామిద్దరి ఆ మ్యూజిక్ ఆల్బమ్ కోసమే రిలేషన్‌షిప్ పేరుతో నాటకం ఆడుతున్నాం వస్తున్న రూమర్లపై చాహత్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ఇతరుల మనోభావాలు ఏమైపోతాయనే విషయాన్ని విషయాన్ని పట్టించుకోరా అని ప్రశ్నించారు.

మికా సింగ్‌తో డేటింగ్
వాస్తవానికి గత రెండు రోజులుగా నా స్నేహితులు, సన్నిహితులు, మీడియా వారు నా బుర్ర తింటున్నారు. మికా సింగ్‌తో డేటింగ్ చేయడం లేదు. ప్రేమ, పెళ్లి అనే ఉద్దేశం లేదు. నా జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా నేను చాలా విషాదాన్ని అనుభవించాను. ఇప్పుడిప్పుడే స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటున్నాను అని చాహత్ అన్నారు. .

క్వారంటైన్ సమయంలో
మికా సింగ్, నేను పక్క పక్కనే ఫ్లాట్స్‌లో ఉంటాం. క్వారంటైన్ సమయంలో ఆయన ఇంట్లోకి వెళ్లాను. ఏదో రెండు ఫోటోలు తీసుకొన్నాను. అంత మాత్రాన డేటింగ్ అంటూ ఏదేదో మాట్లాడారు. ప్రమోషన్ కోసమే అంటూ ఏవేవో కథలు అల్లారు అని చాహత్ మండిపడ్డారు.

మికా సింగ్‌తో కలిసి
మికా సింగ్ మంచి స్నేహశీలి. ఆయనతో ఇతరులకు ఎందుకు సమస్యలున్నాయో అర్థం కావడం లేదు. మేము రెండు రోజులుగా షూట్ చేస్తున్నాం. చాలా ఉత్సాహంగా పని జరుగుతున్నది. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మీకెందుకు ఇది సమస్యగా కనిపిస్తుందో అర్థం కావడం లేదు అని చాహత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్నందుకు క్వారంటైన్ లవ్ అంటూ ఏదేదో వాగుతున్నారన్నారు.
Recommended Video

మళ్లీ పెళ్లి చేసుకోను
మికా సింగ్ గురించి చెప్పాలంటే చాలా కేరింగ్ పర్సన్. నిజాయితీతో కూడిన వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయనను నేను బాగా ప్రేమిస్తాను. మేమిద్దరం మంచి స్నేహితులం. అంతేగానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. నా జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోదలచుకోలేదు. కాకపోతే నేను రిలేషన్‌షిప్‌కు ఓపెన్. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇది నా అభిప్రాయం అని చాహత్ స్పందించారు.


Click it and Unblock the Notifications











