వివేక్ ఒబేరాయ్ ఎదురుదెబ్బ.. ఐశ్వర్యరాయ్‌ని కెలికి విలన్‌గా మారిన హీరో
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌పై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ వివాదాస్పద ట్వీట్‌ను రీట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వేడి పుట్టించింది. ఎగ్జిట్ పోల్స్‌తో ఐశ్వర్యరాయ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ షేర్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబేరాయ్ షేర్ చేశాడు. వివేక్ ట్వీట్‌పై నెటిజన్లు దుమ్మ దులిపారు. దాంతో వివేక్ ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు చెప్పారు.
అయితే మీమ్ ట్వీట్ వివాదం వివేక్ ఒబేరాయ్‌ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల జాతీయ మహిళా కమీషన్ నుంచి నోటీసులు అందుకొన్నారు. మహిళ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని కమిషన్ మండిపడింది.

ఒడిశా తుఫాన్ బాధితుల కోసం విరాళాల సేకరణకు డీఎల్ఎఫ్ ప్రొమెనాడ్ చేపట్టిన కార్యక్రమం నుంచి వివేక్ ఒబేరాయ్‌ని తప్పించడం బాలీవుడ్ వర్గాలను షాక్ గురి చేసింది. మా సంస్థ మహిళా చైతన్యానికి కట్టుబడి ఉంది. ఈ క్రమంలో మీరు వారి ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారు అని డీఎల్ఎఫ్ సంస్థ తన వివరణలో పేర్కొన్నది.
వివాదాస్పద మీమ్‌లో ఏమున్నదంటే... ఓపినియన్ పోల్ అంటే ఐశ్వర్యరాయ్‌తో సల్మాన్ ఖాన్ అఫైర్ ఉన్నట్టు.. ఎగ్జిట్ పోల్ అంటే తనతో ఐష్‌కు అఫైర్ ఉన్నట్టు.. చివరకు ఫలితం అంటే అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకొని పిల్లపాపలతో ఉన్నట్టు అని అర్ధం వచ్చేలా మీమ్‌ను నెటిజన్ డిజైన్ చేసి షేర్ చేశాడు. ఆ ఫొటోను వివేక్ షేర్ చేసి దీనిని రాజకీయం చేయవద్దు.. జస్ట్ ఫర్ ఫన్ అని ట్వీట్ వివేక్ ఒబేరాయ్ చేయడం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











