మళ్లీ ఇరుకున్న శిల్పా శెట్టి- కుంద్రా... కోట్ల రూపాయల మోసం కేసు... చిక్కులు తప్పేట్టులేవుగా!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాల కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే లీగల్ కేసులలో ఇరుక్కున్న ఈ జంటపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో శిల్పా, రాజ్‌లపై కోట్లాది రూపాయల చీటింగ్ కేసు నమోదైంది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల పై చీటింగ్ కేసు నమోదు చేయబడింది. అందిన సమాచారం ప్రకారం 2014 నుండి శిల్పా మరియు రాజ్ తనను ఒక సంస్థ ద్వారా మోసం చేస్తున్నారని నితిన్ బరాయ్ అనే వ్యక్తి బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారి మీద కేసు నమోదు అయింది..అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే

కేసులు- సెక్షన్లు

కేసులు- సెక్షన్లు

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, M/s SFL ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, కాషిఫ్ ఖాన్, దర్శిత్ షా మరియు వారి సహచరులు జూలై 2014 నుండి నితిన్ ను మోసం చేస్తున్నారట. నితిన్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్ 406, 409, 420, 506, 34, 120 (బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముంబై పోలీసులు ఈ కేసులో నిందితులను కూడా త్వరలో విచారించవచ్చు, రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి వైపు తెలుసుకోవడానికి పోలీసులు త్వరలో వారిని సంప్రదించవచ్చని అంటున్నారు.

విషయం ఏమిటి అంటే?

విషయం ఏమిటి అంటే?

పూణేలోని కోరేగావ్ ప్రాంతంలో తన కంపెనీ ఫ్రాంచైజీని తీసుకుని స్పా, జిమ్‌ను తెరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పినట్లు శిల్పా, రాజ్ లు తనను నమ్మబలికారు అని నితిన్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే నితిన్ రూ.1 కోటి 59 లక్షల 27 వేలు పెట్టుబడి పెట్టగా, ఆ తర్వాత నితిన్ సొమ్మును నిందితులు వ్యాపారం కోసం కాకుండా తమ స్వ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు అని, అతను తన డబ్బును తిరిగి అడగడంతో ఈ బ్యాచ్ అంతా బెదిరించారట.

రాజ్-శిల్పా హిమాచల్‌లో కనిపించారు

రాజ్-శిల్పా హిమాచల్‌లో కనిపించారు

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో నిందితుడైన రాజ్ కుంద్రా జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత హిమాచల్‌లో శిల్పాశెట్టితో కనిపించాడు. రాజ్ ఇక్కడ మీడియాతో మాట్లాడలేదు. దీని తర్వాత రాజ్ కుంద్రా బాంద్రాలోని బొమ్మల దుకాణం వెలుపల కూడా కనిపించాడు. అందిన సమాచారం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ధర్మశాలలోని బగ్లాముఖి ఆలయానికి వెళ్లి అక్కడ తాంత్రిక పూజలు చేశారు.

తాంత్రిక పూజలు

తాంత్రిక పూజలు

దేవాలయం నుంచి వారిద్దరికీ వీడియోలు, చిత్రాలు బయటపడ్డాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ తాంత్రిక పూజలు శత్రు నాశనానికి, బాధలు తొలగేందుకు చేశారని అంటున్నారు. రాజ్-శిల్ప హవాన్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. బగ్లాముఖి ఆలయానికి వెళ్లే ముందు, రాజ్ శిల్పా కాంగ్రాలోని ఆలయాల్లో తల వంచుకుని మీడియా కంటపడకుండా ఉండేలా జాగ్రత్త పడింది.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
సోషల్ మీడియాకు రాజ్ గుడ్ బై

సోషల్ మీడియాకు రాజ్ గుడ్ బై

రాజ్ కుంద్రా కూడా జైలు నుంచి బయటకు రాగానే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాడు. అతను తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా తొలగించాడు. అందిన సమాచారం ప్రకారం, అశ్లీల చిత్రాల కేసులో అతని పేరు ముడిపడి ఉండటంతో అతను మరియు అతని కుటుంబం చాలా ట్రోల్ చేయబడుతున్నారు. ఇంతకుముందు, రాజ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండేవాడు. భార్య శిల్ప మరియు పిల్లలతో చాలా వీడియోలను కూడా పంచుకున్నాడు. కానీ ట్రోల్స్ దెబ్బకు ఆయన సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X