కారులో మహిళతో సినీ నిర్మాత రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు పట్టుబడటంతో..

ఇటీవల కాలంలో కొంతమంది అక్రమ సంబంధాలతో వారి ఫ్యామిలీ లైఫ్ ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో అలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లోనే ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలకు సంబంధించిన అక్రమ సంబంధాలు బయటకు రావడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ మధ్య టాలీవుడ్ లో కూడా ఒక సీనియర్ నటుడు సీనియర్ నటి మధ్యలో అక్రమ సంబంధం కొనసాగిన విషయం బయటకు వచ్చింది. ఆ విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఇప్పుడు మరొక సినీ నిర్మాత కూడా అలాంటి వివాదంతోనే వార్తల్లో నిలిచాడు. భార్యకు అతడు అడ్డంగా దొరికిపోవడంతో ఆ తర్వాత యాక్సిడెంట్ చేయాలని కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో నిర్మాతగా గుర్తింపు అందుకున్న కమల్ కిషోర్ మిశ్రా ఇటీవల తన ఇంటి దగ్గర కారులోని ఒక మహిళతో ఉండడం అతని భార్య గమనించింది.

Cheating case has been registered against filmmaker Kamal Kishor Mishra

ఇక అనుమానంతో దగ్గరికి వెళ్లి అతన్ని బయటికి రావాలి అని గట్టిగా నిలదీసింది. కానీ మిశ్రా మాత్రం కారులో నుంచి బయటకు దిగకుండా ఆమెతో వాదించే ప్రయత్నం చేశాడు. ఇక తర్వాత అతను ఒక్కసారిగా కారును ముందుకు పోనివ్వడంతో అతని భార్య యాక్సిడెంట్ కు గురైంది. కారు ఢీకొట్టడంతో మిశ్రా భార్య ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఆమె చేతులకు తలకు కొంత గాయాలు అయ్యాయి

ఆమెను వెంటనే సమీపంలో ఉన్న మరొక వ్యక్తి కాపాడాడు. కమల్ కిషోర్ పై ఇదివరకే అతని భార్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అతను ప్రవర్తించిన తీరుకు ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వెంటనే కమల్ కిషోర్ పై పోలీస్ కేసు నమోదు చేసింది. అలాగే అతనితో ఉన్న మహిళపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కమల్ ఆ వివాదంపై స్పందించింది లేదు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X