Saif Ali Khan Net Worth : 1000 కోట్ల విలువైన ప్యాలెస్.. ఇంకా, సైఫ్ ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ కరీనా కపూర్ భర్త సైఫ్ అలీఖాన్‌ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారన్న విషయం తెలిసి సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముంబైని జల్లెడ పడుతున్నారు.

కాగా.. బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సినిమాల కంటే ముందు ఇతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దది. పటౌడీ రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్.. అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ- సినీనటి షర్మిలా ఠాగూర్ కుమారుడు . 16 ఆగస్ట్ 1970న న్యూఢిల్లీలో జన్మించిన ఆయన హిమాచల్ ప్రదేశ్, యూకేలలో చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన బేకౌడీతో (1992)లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Check Bollywood star Hero Saif Ali Khan s annual income inheritance and luxury collection

1993లో పరంపరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ తనదైన నటనతో మూడు దశాబ్ధాలుగా అలరిస్తున్నారు. యాక్టింగ్‌, ఫిట్‌నెస్, వ్యక్తిగత జీవితం.. ఇలా సైఫ్‌కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది. స్టార్ హీరో, రాజవంశం అయినంత మాత్రాన ఆయనేమీ కష్టాలకు అతీతం కాదు. సగటు మనిషిగా వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 21 ఏళ్ల చిన్న వయసులోనే 1991లో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో సైఫ్ అలీ ఖాన్ పెళ్లయ్యింది. ఈ దంపతులకు సోహా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం.

13 ఏళ్ల పాటు కలిసున్న ఈ జంట 2004లో విడాకులు తీసుకుని విడిపోయింది. ఈ క్రమంలో సైఫ్ .. నటి రోసాతో డేటింగ్ చేశారు. అయితే అనివార్య కారణాలతో వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. అనంతరం 2012లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వారికి తైమూర్, జై అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ అలీఖాన్ వేల కోట్ల ఆస్తులకు వారసుడు.. పూర్వీకులు ఇచ్చిన దానికి తను సంపాదించినది తోడవ్వడంతో ఆయన బాలీవుడ్‌లో బిలియనీర్‌గా వెలుగొందుతున్నారు.

Check Bollywood star Hero Saif Ali Khan s annual income inheritance and luxury collection

అన్నింటిలోకి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ ప్రత్యేకమైనది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజప్రసాదాన్ని ఇబ్రహీం కోఠిగా పిలుస్తారు. ఇందులో 150 గదులు, ఏడు పడక గదులు ఉంటాయట. ఈ పటౌడీ ప్యాలెస్ విలువ రూ. వెయ్యి కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు ఆయన రూ.10 నుంచి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని బీటౌన్ టాక్.

అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఓటీటీ వెంచర్ల ద్వారా ఏడాదికి రూ.28 నుంచి రూ.30 కోట్ల వరకు సైఫ్ అలీ ఖాన్ సంపాదిస్తారు. ఇక లగ్జరీ కార్లు, విలువైన వస్తువులకు లెక్కేలేదు.. మొత్తంగా సైఫ్ అలీఖాన్ ఆస్తుల విలువ రూ. 1400 కోట్లపైనే ఉంటుందని అంచనా. వివాదాలకు దూరంగా , స్నేహశీలిగా పేరొందిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆసుపత్రి పాలు కావడతో ఆయన కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X