భర్తతో ఘాటుగా... టెమ్ట్ చేస్తున్న ప్రియాంక చోప్రా రొమాంటిక్ ఫోటోలు!
Recommended Video
అమెరికా అంటేనే భారీగా సంపాద, లగ్జరీ లైఫ్. అందుకే సామాన్య జనం నుంచి సినిమా సెలబ్రిటీల దాకా అక్కడికి వెళ్లి సెటిలయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా వెళ్లిన వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. హాలీవుడ్లో ఎదగడమే లక్ష్యంగా అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన ప్రియాంక... అక్కడ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా లైఫ్ స్టైల్ మరింత విలాసవంతంగా మారిందని చెప్పక తప్పదు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకను మియామీలో తన జీవితంలో ఎన్నడూ జరుపుకోనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఇంకా మియామి వెకేషన్ మూడ్లో ప్రియాంక చోప్రా
ప్రియాంక, నిక్ జోనస్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ యాచ్(లగ్జరీ బోట్)లో మియామీ సముద్ర తీరంలో పర్యటిస్తూ ఎంజాయ్ చేశారు. ఇది జరిగిన దాదాపు వారం పది రోజులు గడిచినా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రియాంక షేర్ చేస్తూనే ఉన్నారు.

భర్తతో కలిసి ఘాటైన రొమాన్స్
ఈ విలాసవంతమైన ట్రిప్‌లో భర్త నిక్ జోనస్‌తో కలిసి హ్యాపీ మూడ్లో కనిపించారు ప్రియాంక. అతడితో రొమాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తాజాగా ప్రియాంక చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి ‘మై హార్ట్' అంటూ క్యాప్షన్ పెట్టారు.

మందు, విందుతో జల్సాలు
ఈ వెకేషన్లో మందు, విందు ఇలా అన్ని రకాలుగా జల్సాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక దంపతులతో పాటు... ఆమె తల్లి మధు చోప్రా కూడా సిగార్లు వెలిగించి పొగత్రాగుతున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ వెకేషన్లో వీరితో పాటు ప్రియాంక సోదరి పరిణీతి చోప్రా కూడా కనిపించారు.

ప్రియాంక-నిక్
తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి హాలీవుడ్ నటుడు డ్వేజ్ జాన్సన్(ది రాక్) వారధిలా నిలిచాడు. అతడి ద్వారా వీరిద్దరూ ఓ పార్టీలో పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. జైపూర్లో వీరి వివాహం భారతీయ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.


Click it and Unblock the Notifications











