Chhaava : విక్కీ కౌశల్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంత? చావాకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ దాకా ఒక సినిమా గురించి చర్చించుకుంటున్నారు అదే చావా. మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. పతాక సన్నివేశాల్లో రక్తమోడుతున్న శరీరంతో , కళ్లు పొడిచినా, నాలుక కోసినా తలవంచని తీరు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో విక్కీ కౌశల్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే విక్కీ తొలి పారితోషికం ఎంత? చావాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? అంటూ నెటిజన్లు జల్లెడ పడుతున్నారు.
16 మే, 1988న ముంబైలో జన్మించిన విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ హిందీ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ కావడంతో సినిమా నేపథ్యం ఉంది. బీటెక్ పూర్తి చేసిన విక్కీ కౌశల్ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.. అయితే తన మనసు సినిమాలపైనే ఉండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కిశోర్ నమిత్ కపూర్, మనావ్ కౌల్, నసీరుద్దీన్ షా వంటి దిగ్గజాల దగ్గర నటనలో ఓనమాలు దిద్దారు. ప్రొడక్షన్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించిన విక్కీ నేడు భారతదేశంలోని స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, చిన్నా చితకా పాత్రలలోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు విక్కీ కౌశల్ . మసాన్‌తో హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇలాంటి దశలో ఉరి : ది సర్జికల్ స్టైక్ సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో ఆర్మీ ఆఫీసర్‌గా విక్కీ అద్భుతంగా నటించారు. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉధంలో జీవించారు.
ఇక భారతదేశ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా తెరకెక్కిన సామ్ బహదూర్‌లో నిజంగా శ్యామ్‌నే తెరపై చూసినట్లుగా దించేశారు విక్కీ కౌశల్. ఇందుకోసం గంటల తరబడి శ్యామ్ మాటలను, హావభావాలను పరిశీలించి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. బయోపిక్స్‌లో సత్తా చాటుతున్న విక్కీ కౌశల్‌కు ఈ క్రమంలోనే ఛత్రపతి శంభాజీ జీవిత కథలో నటించే అవకాశం దక్కింది. శంభాజీ పాత్ర కోసం 100 కేజీలకు పైగా బరువు పెరిగిన ఆయన రాజులా కనిపించేందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఔరంగజేబు చేతిలో చిత్ర హింసలను ఎదుర్కొనే సమయంలో విక్కీ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాడు. శంభాజీగా విక్కీని తప్పించి మరొకరిని ఊహించుకోలేనంత ఆయన జీవించారు.

ఇక ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ ఎంత పారితోషికం తీసుకున్నారు? అసలు తొలి సినిమాకు రెమ్యునరేషన్ ఎంత? అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఓ ప్రొడక్షన్ కంపెనీలో తొలుత ప్రొడక్షన్ బాయ్‌గా చేరిన ఆయన తొలి పారితోషికం కింద రూ.1500 అందుకున్నారు. ఇక చావా చిత్రానికి గాను విక్కీ కౌశల్ రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా బాలీవుడ్ టాక్. చావా తర్వాత లవ్ అండ్ వార్ సినిమాలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











