అందవిహీనంగా దీపిక పదుకోన్: ‘ఛపాక్’ ఫస్ట్ లుక్ షాకింగ్
Recommended Video

బాలీవుడ్ అందమైన కథానాయికల్లో దీపిక పదుకోన్ ఒకరు. కేవలం ఆమె యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు.. ఆమె నిర్మలమైన బ్యూటీని చూసి ఎంజాయ్ చేసేందుకు థియేటర్లకు వచ్చే అభిమానులు సైతం ఉన్నారు. అయితే రాబోయే చిత్రంలో దీపిక నుంచి బ్యూటీని ఎక్స్‌పెక్ట్ చేయవద్దు.
ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక పదుకోన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఛపాక్' అనే టైటిల్ పెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన దీపిక... తాజాగా ఫస్ట్ లుక్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.
దీపిక లుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
'ఛపాక్' మూవీ షూటింగ్ మొదలైన సందర్బంగా సోమవారం(మార్చి 25)న ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీపిక లుక్ చూసి అభిమానులు షాకవుతున్నారు. కలలో కూడా ఆమెను అభిమానులు ఎప్పుడూ ఇలా ఊహించి ఉండరు.

ఈ పాత్ర చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్న దీపిక
ఛపాక్ గురించి దీపిక వెల్లడిస్తూ.. 'గాయపడి, గెలిచిన వ్యక్తి కథ. మనిషి యొక్క బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలిజేసే కథ. ఇలాంటి కథ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా రాబోతోంది' అని తెలిపారు.

మాల్తి పాత్రలో దీపిక
ఈ చిత్రంలో దీపిక పదుకోన్ మాల్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు. మల్తి పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని దీపిక తెలిపారు. దీపిక లక్ష్మీ అగర్వాల్ పాత్ర పోషిస్తుండగా ఆమె భర్త, పాత్రికేయుడు అలోక్ దీక్షిత్ పాత్రలో విక్రాంత్ మస్సే కనిపించనున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే
జనవరి 10, 2020న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపిక పదుకోన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచేలా ఈ చిత్రం ఉంటుందట. ఆమె ఈ చిత్రానికి సహ నిర్మాత కూడా.


Click it and Unblock the Notifications











