twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహనటి కన్నుమూత, షాక్‌లో బాలీవుడ్ ప్రముఖులు

    |

    దేశంలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సినీ పరిశ్రమలో పలువురు మృత్యువాత పడటం మరింత విషాదంగా మారుతున్నది. తాజాగా బాలీవుడ్, మరాఠీ నటి అభిలాష పాటిల్ కరోనావైరస్ పాజిటివ్‌తో కన్నుమూశారు. ఆమె ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచ్చోరే, అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన గుడ్ న్యూస్, బద్రీనాథ్ దుల్హానియా చిత్రాల్లో నటించారు.

    కళ్ళతోనే మత్తు మందు జల్లుతున్న మేఘాలి

    అభిలాష పాటిల్ వయసు 40 సంవత్సరాలు. ఆమె మరాఠీ చిత్రాల్లో నటించడం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తుజా మాంజా అరెంజ్ మ్యారేజ్, బేకో దేతా కా బేకో, పిప్సి చిత్రాల్లో నటించారు. అభిలాష పాటిల్ ఆకస్మిక మరణంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    Chhichhore fame Abhilasha Patil died with coronavirus

    బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ పరేశ్ పటేల్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ.. అభిలాష పటేల్ లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు.

    కరోనావైరస్ బారిన పడ్డారనే విషయాన్ని తెలుసుకొని అభిలాషతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఆమె రెండు ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆమె సహనటుడు ఆనంద్ ప్రభు విషాద వార్తను చేరవేశాడు. దాంతో ఓ రకమైన షాక్ గురయ్యాను. ఓ మంచి నటిని సినిమా పరిశ్రమ కోల్పోయింది అని మరాఠీ నటుడు సంజయ్ కులకర్ణి తెలిపారు.

    English summary
    Chhichhore fame and Marathi actress Abhilasha Patil died with coronavirus in Mumbai. She was 40 years. She acted in films like Badrinath Ki Dulhania, Good Newwz and Chhichhore. Many Bollywood and Marathi film personalities and Abhilasha's friends expressed their grief on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X