లంగా పైకెత్తమన్నాడు.. నవాజుద్దీన్ చూస్తూ మాట్లాడలేదు.. డైరెక్టర్‌ వేధింపులపై చిత్రంగద

నానా పాటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాకు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్ నటి చిత్రంగదా సింగ్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకొన్నది. 2016లో బాబుమోషాయ్ బదూక్‌బాజ్ షూటింగ్ సమయంలో దర్శకుడు కుషన్ నందీ తనతో ప్రవర్తించిన విధానాన్ని మరోసారి ఎండగట్టింది. ఎందుకు ఆ సినిమా నుంచి తప్పుకొన్నానో అనే విషయాన్ని వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచంపై నవాజుద్దీన్ సిద్ధిఖీతో

మంచంపై నవాజుద్దీన్ సిద్ధిఖీతో

బాబుమోషాయ్ బదూక్‌బాజ్ చిత్ర షూటింగ్‌ సమయంలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో మంచంపై ఓ సీన్ చేయాల్సింది. నాకు గుండీలు లేని జాకెట్ తొడిగించి, కేవలం లంగాపై ఉంచారు. ఆ సినిమాలో ముందు చెప్పని సీన్‌ను హడావిడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

లంగా పైకి ఎత్తి.. కాళ్లు వెడల్పుగా

లంగా పైకి ఎత్తి.. కాళ్లు వెడల్పుగా

సీన్ షూట్‌లో ఉండగా దర్శకుడు కుషాన్ వచ్చి.. లంగా పైకి ఎత్తి.. కాళ్లు వెడల్పుగా చాపి నవాజుద్దీన్‌పై పడుకో అని చెప్పాడు. తాను అభ్యంతరం చెబుతున్నా నా మాటలు పట్టించుకోలేదు. ఆపై దారుణంగా బిహేవ్ చేశాడు.

దారుణంగా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ సిద్దిఖీ

దారుణంగా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ సిద్దిఖీ

దర్శకుడు కుషాన్ నాతో దారుణంగా ప్రవర్తిస్తున్నా నవాజుద్దీన్ సిద్ధిఖి ఏం మాట్లాడకుండా చూస్తుండిపోయాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ విషయంలో మాట్లాడుతూ.. రెండుసార్లు ఓ సీన్‌లో మజా చేశాను అని చెప్పడానే విషయాన్ని గుర్తు చిత్రంగదా గుర్తు చేసింది. అలాంటి సీన్లు నచ్చకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను అని వెల్లడించింది.

తోసిపుచ్చిన కుషాన్ నందీ

తోసిపుచ్చిన కుషాన్ నందీ

చిత్రంగదా తమపై చేసిన ఆరోపణలను దర్శకుడు కుషాన్ తోసిపుచ్చాడు. సరిగా నటించకపోవడం వల్లనే ఆమెను ఆ సినిమా నుంచి తప్పుకోమని చెప్పాం. ఆ తర్వాత ఆమె స్థానంలో బిదితా బేగ్‌ను తీసుకొన్నామని కుషాన్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X