twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా పరిశ్రమలో మరో విషాదం.. 2000పాటలకు డ్యాన్స్ మాస్టర్‌గా వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ కన్నుమూత

    |

    హిందీ చిత్రసీమ దిగ్గజాలు రిషికపూర్, ఇర్ఫాన్, యువ హీరో సుశాంత్ లాంటి ఆకస్మిక మరణాలతో విషాదంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ను మరో విషాదం ముంచెత్తింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను వెంటనే ముంబైలోని హాస్పిటల్‌లో తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు అని సరోజ్ ఖాన్ కుమార్తె మీడియాకు తెలిపారు. శుక్రవారం రాత్రి 1.52 గంటలకు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    గుండెపోటుతో మృతి..

    గుండెపోటుతో మృతి..

    శుక్రవారం ఉదయం సరోజ్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలియజేశారు. 71 ఏళ్ళ వయసు ఉన్న సరోజ్ ఖాన్ గత కొంతకాలంగా కొంత అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. పంజాబ్ లోని గురు నానక్ హాస్పిటల్ లో పది రోజుల నుంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

    పరిస్థితి విషమించడంతో..

    పరిస్థితి విషమించడంతో..

    అయితే శుక్రవారం ఉదయం ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ఐసియులోనే చికిత్స చేసి ఆమెను బ్రతికించాలని వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె ఎంత ప్రయత్నం చేసిన ఆమె ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడంతో హఠాత్తుగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్దారించారు.

     2000పాటలకు పైగా..

    2000పాటలకు పైగా..

    నాలుగు దశాబ్దాల పాటు సరోజ్ ఖాన్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. దాదాపు 2000 పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసిన ఆమె మూడు సార్లు నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆమె కంపోజ్ చేసిన వాటిలో డోలారే.. డోలారే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    అప్పట్లో ఒక ట్రెండ్ సెట్..

    అప్పట్లో ఒక ట్రెండ్ సెట్..

    అలాగే ఏక్ దో తీన్ వంటి మాస్ మసాలా సాంగ్స్ కూడా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. సరోజ్ ఖాన్ 1974 నుంచి కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. ఇక ఆమె మరణవార్త గురించి తెలియగానే ఆమెతో వర్క్ చేసిన వారే కాకుండా ఇతర సినీ ప్రముఖులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    కరోనా బారిన పడ్డారేమోనన ఆందోళన

    కరోనా బారిన పడ్డారేమోనన ఆందోళన

    కొద్ది రోజుల క్రితం ఆమెకు శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో కరోనావైరస్ బారిన పడ్డారేమోననే కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకలేదనే విషయంతో ఫ్యామిలీ ఊరట చెందారు. అయితే కోలుకొంటుందని భావించిన కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి ఆమె మరణం తీవ్రమైన షాక్‌కు గురించి చేసింది. ఆమె మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలను శుక్రవారం ముంబైలోని మల్వానీలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

    Recommended Video

    Surya Asthamayam Movie Trailer Launch |Trishul Rudra | Himansee Katragadda
    అనారోగ్యంతో బాలీవుడ్‌కు దూరం

    అనారోగ్యంతో బాలీవుడ్‌కు దూరం

    71 ఏళ్ల సరోజ్ ఖాన్‌కు వృద్దాప్యపరమైన, ఆరోగ్య సమస్యల తలెత్తడం కారణంగా ఇటీవల కాలంలో కొరియోగ్రఫికి దూరంగా ఉంటున్నారు. ఆమె గతేడాది కరణ్ జోహర్ రూపొందించిన ళంక్ చిత్రంలో ఆఖరిగా నృత్యాలు సమకూర్చారు. ఆ తర్వాత నుంచి ఆమె పాటలకు నృత్యాలు సమకూర్చిన దాఖలాలు లేవు.

    English summary
    Choreographer Saroj Khan no more. She died with illness in mumbai. Her family members said that, No covid19 symptoms so far. She is stable and recovering.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X