డ్రగ్స్ కేసుతో సతమతమైన బాలీవుడ్ నటి.. ఎట్టకేలకు దుబాయ్ నుంచి విడుదల!
ఇక సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా ఈ నెల ప్రారంభంలో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇటీవల ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) జైలు నుండి విడుదలయ్యారు. ఒక కుక్క విషయంలో జరిగిన గొడవ కారణంగా బేకరీ యజమాని ఆమెను పగతో ఇరికించాడని తెలుస్తోంది.
ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమెను నిర్దోషి అని గుర్తించి, బేకరీ యజమాని ఆంథోనీ పాల్ ను అలాగే అతనికి సహాయపడిన బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ బోభాటేలను అరెస్టు చేసింది. ఆంథోనీ సోదరి కుక్క విషయంలో నటి తల్లితో గొడవపడిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక అదే విషయంపై డ్రగ్ మ్యూల్‌గా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

టాలెంట్ కన్సల్టెంట్ గా నటిస్తూ షార్జాలో జరిగిన ఒక వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఆడిషన్ గురించి రాజేష్ ద్వారా ఆంథోనీ నటిని సంప్రదించాడు. ఇక అతను డ్రగ్స్‌ను దాచిపెట్టిన ఒక ట్రోఫీని తీసుకెళ్లమని ఆమెను కోరాడు, అది ఆడిషన్ ప్రాప్ అని ఆమెకు చెప్పాడు. ఆమె దిగిన తర్వాత, అతను షార్జా విమానాశ్రయానికి కాల్ చేసి, ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు అధికారులకు చెప్పాడు.
పెరీరా డ్రగ్స్ తో పట్టుబడిన తర్వాత ఆమెను విడుదల చేయడానికి ₹ 80 లక్షలు డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కనీసం ఐదుగురిని ట్రాప్ చేసేందుకు ఆంథోనీ, రాజేష్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఇక మోసన్ని గుర్తించిన పోలీసులులు క్రిసన్ పెరీరా నిర్దోషి అని చెప్పారు.
ఆమెను బుధవారం రాత్రి విడుదల చేశారు, పోలీసులు కేసు సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు పంపారు. ఆమె సోదరుడు, కెవిన్ పెరీరా, షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు వారి తల్లి ఆనందంలో ఉన్నట్లు చూపించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఆ నటి 48 గంటల్లో భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











