twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్‌కు CISF షాక్.. జనం మధ్య నిలబెట్టి తనిఖీలు.. అసలేం జరిగిందంటే?

    |

    మన దేశంలో కొంతమంది నటులకు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇష్టమైన హీరోలను హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే దేవుడిలా భావిస్తారు. ఇక తన అభిమానుల నుండి అపారమైన ప్రేమ, ఆప్యాయతను ఆస్వాదించే నటులలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అందరికి తెలిసిన విషయమే. అతని అభిమానులు సల్లూ భాయ్ అని ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. ఇక అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయి.

    ఇక సల్మాన్ ఖాన్ బయట ఎక్కడ కనిపించినా కూడా జనాలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. మీడియా సభ్యులు కూడా స్టిల్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ కు ఒక CIF గార్డ్ నుంచి ఒక షాక్ ఎదురైంది. నటుడిని విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు CISF సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.

    చాలా కాలం తరువాత

    చాలా కాలం తరువాత

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా కాలం తరువాత మళ్ళీ షూటింగ్ పనులతో బిజీ అవుతున్నాడు. లాక్ డౌన్ లో ఎక్కువగా తన ఫామ్ హౌజ్ లో వ్యవసాయం అంటూ కాస్త ప్రశాంతంగా గడిపాడు. ఆ సమయంలో కొంతమంది సినీ నటిమణులు కూడా ఆయనతో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక రాధే సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేసి ఓటీటీలో పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ సినిమా అనుకున్నంతగా రేంజ్ లో అయితే సక్సెస్ అవ్వలేదు.

    అందరూ చూస్తుండగనే

    ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఒక వీడియో అయితే వైరల్ గా మారింది. ఒక CISF గార్డ్ సల్మాన్ ఖాన్ ను జనాలు అందరూ చూస్తుండగనే అడ్డుకున్నాడు. గురువారం (ఆగస్టు 19) రాత్రి, సల్మాన్ తన తదుపరి చిత్రం 'టైగర్ 3' షూటింగ్ కోసం రష్యాకు వెళ్ళాడు అయితే వెళ్లే క్రమంలో ఎయిర్ పోర్డ్ దగ్గర ఈ స్టార్ హీరోకు వింత అనుభవం ఎదురైంది.

    బాధ్యతాయుతంగా ఆపాడు

    బాధ్యతాయుతంగా ఆపాడు

    ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఈ సీన్ కనిపించింది. ఇక సల్మాన్ తో ఒక ఫోటో కోసం అతని చుట్టూ అభిమానులు గుమిగూడడం చూడవచ్చు. అతను కారు నుండి దిగిన వెంటనే మీడియా సభ్యులు కూడా ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక ఎంట్రీ గేట్ వైపుకు వెళ్లిన సల్మాన్ ఖాన్ పాస్ పోర్ట్ తనిఖీ అవ్వకముందే లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడే డ్యూటీ స్టాప్‌లలోని CISF గార్డు సల్మాన్ ఖాన్ ను బాధ్యతాయుతంగా ఆపాడు.

    CISF అధికారిపై ప్రశంసలు

    CISF అధికారిపై ప్రశంసలు

    ఒక్క సేకనులో సల్మాన్ ఖాన్ కొంత ఆశ్చర్యానికి గురై వెనుకడుగు వేశాడు. అనంతరం సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ కావాల్సిన తనిఖీలకు సహకరించాడు. తగిన విధానాన్ని అనుసరించిన తరువాతనే సల్మాన్ విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. CISF అధికారి తన అచంచలమైన కర్తవ్యానికి నెటిజన్ల హృదయాన్ని గెలుచుకుంటున్నారు. ఒక స్టార్ సెలబ్రెటీ అనే బేధాన్ని చూపకుండా అందరిని ఒకేలా చూడాలి అనే సిద్ధాంతాన్ని అతను చక్కగా నిర్వర్తించినట్లు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

    అతని పేరు చెప్పండి..

    అతని పేరు చెప్పండి..

    "CISF వ్యక్తి సల్మాన్ ఖాన్ ను ప్రవేశించకుండా ఆపిన తీరు నచ్చింది" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు ఇలా వ్రాశారు, " భాయ్ కొంచెం రూల్స్ పాటించండి ... CISF వ్యక్తి చాలా గ్రేట్ .. దయచేసి అతని పేరును ప్రస్తావించండి." అని అంటున్నారు. అంతే కాకుండా "సెల్యూట్ CISF ఆఫీసర్" అని మరికొందరు ప్రశంసలు కురిపించారు. సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం ఈ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తున్నట్లు అర్ధమవుతోంది.

    English summary
    CISF personnel stops bollywood star Salman Khan from entering airport
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X