ప్రియాంక చోప్రా ఒక సెక్సిస్ట్, రేసిస్ట్ అని కామెంట్స్.. దెబ్బకు దిగొచ్చింది!
అందాల తార ప్రియాంక చోప్రా తన టాలెంట్ తో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లో సైతం ప్రియాంక చోప్రా రాణిస్తోంది. చాలా కాలంగా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో పీసీ ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న జరిగిన వివాహబంధంతో నిక్, ప్రియాంక అధికారికంగా ఒక్కటయ్యారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ప్రియాంక చోప్రా వివాహం జరిగింది. 'ది కట్' అనే అంతర్జాతీయ పత్రిక నిక్, ప్రియాంక చోప్రా వివాహం విషం చిమ్ముతూ సంచలన కథనం వెలువరించింది. తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ ప్రియాంక చోప్రాని టార్గెట్ చేసింది. ఈ కథనం పెను దుమారమే రేపింది.
Recommended Video


వారిద్దరి వివాహం ఒక స్కామ్
సదరు అంతర్జాతీయ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ప్రియాంక, నిక్ వివాహం ఒక స్కామ్ ప్రకారం జరిగింది అని పేర్కొంది. నిక్ జోనస్ ని దిగజార్చేందుకు, అతడిని మోసగించేందుకే ప్రియాంక వివాహం చేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక ప్రేమలో నిజాయితీ లేదంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల వెలువడిన ఈ కథనం ప్రపంచ వ్యాప్తమా హాట్ టాపిక్ గా మారింది.

సెక్సిస్ట్, రేపిస్ట్ అంటూ తీవ్రంగా
ఆ సంస్థ ప్రియాంక చోప్రాపై ఎంతలా విషం చిమ్మిందంటే.. తీవ్రమైన పదజాలం ఉపయోగించింది. ప్రియాంక చోప్రా ఒక సెక్సీస్ట్, రెసిస్ట్ అంటూ దూషించింది. అదే సమయంలో ఈ కథనం రాసిన రచయిత నిక్ జోనస్ కు సలహా కూడా ఇచ్చింది. నిక్ మీరు ఈ కథనం చదువుతున్నట్లు అయితే.. మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రని తెలుసుకోండి అంటూ పేర్కొంది. ప్రియాంక చోప్రా మోడరన్ స్కామ్ ఆర్టిస్టు అని పేర్కొంది.

తీవ్రమైన విమర్శలు
దీనితో సదరు సంస్థపై సెలెబ్రిటీలంతా విరుచుకుపడ్డారు. సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఈ కథనం రాసిన మరియా స్మిత్ పై విరుచుకుపడింది. ప్రియాంక చోప్రాని ఒక సెక్సిస్ట్, రేసిస్ట్ అని పేర్కొంటూ ఒక మహిళ ఇలాంటి వార్త రాయడం చాలా విచారకరం. మరియా నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది అని సోనమ్ కపూర్ పేర్కొంది. నిక్ జోనస్ సోదరుడు జో జోనస్ కూడా మరియాపై మండిపడ్డాడు. ఇంత రాక్షసత్వంగా ఎలా ప్రవర్తించారు అని ప్రశ్నించాడు.

మా స్థాయికి తగ్గట్లుగా లేదు
తీవ్రమైన విమర్శలు తలెత్తుతుండడంతో ఎట్టకేలకు ది కట్ సంస్థ, ఆ కథనం రాసిన మరియా స్పందించారు. ప్రియాంక చోప్రాని క్షమాపణలు కోరుతూ ఆ కథనాన్ని తొలగించారు. సంస్థ స్పందిస్తూ.. ఇటీవల ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పై వచ్చిన కథనం మా సంస్థ స్థాయికి తగ్గట్లుగా లేదు. అందుకు చింతిస్తున్నాము. ఆ కథనం స్థానంలో నిక్, ప్రియాంకకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వార్త రాశామని సదరు పత్రిక పేర్కొంది.

దిగొచ్చిన మరియా
ప్రియాంకపై విషం చిమ్ముతూ కథనం రాసిన రచయిత మరియా కూడా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. ప్రియాంక, నిక్ లకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. పాఠకులు కూడా నాకు క్షమించాలి. జాత్యహంకారాన్ని ప్రేరేపించాలనేది నా ఉద్దేశం కాదు. నేను చేసిన ఈ తప్పుకు పూర్తి భాద్యత వహిస్తున్నా అంటూ మరియా ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











