twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో యువ కమెడియన్.. అరెస్ట్ తప్పించుకోవాలంటే గర్బం దాల్చాల్సిందే

    |

    వర్ధమాన కమెడియన్, సంగీత దర్శకుడు, సినీ ప్రముఖుడు కెన్నెత్ మ్యాథ్యూ సెబాస్టియన్ చిక్కుల్లో పడినట్టు కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో బూతులు తిట్టడంపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ నుంచి తప్పించుకోవాంటే మీరు అలా చేయాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ యువ కమెడియన్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకు ఈ వివాదం ఏమిటంటే..

    ఇన్స్‌టాగ్రామ్‌లో 862K ఫాలోవర్స్

    ఇన్స్‌టాగ్రామ్‌లో 862K ఫాలోవర్స్

    కమెడియన్‌గా కెన్నెత్ సెబాస్టియన్‌ హిందీలో మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆయనకు 862K ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన నిర్వహించే యూట్యూబ్‌ ఛానెల్‌కు 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌ ఉన్నారు. బెంగళూరుకు చెందిన ఈ కమెడియన్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన షోలు ప్రసారం కాగా, మంచి ఆదరణ లభించింది.

    మతం, పాలిటిక్స్ గురించి

    మతం, పాలిటిక్స్ గురించి

    ఇలాంటి ప్రేక్షకాదరణ ఉన్న కెన్నెత్ మ్యాథ్యూ సెబాస్టియన్‌కు మరో నెటిజన్‌కు మధ్య భారత, అమెరికా పాలిటిక్స్, మతం గురించి సోషల్ మీడియా అకౌంట్‌లో వాడివేడీగా చర్చ జరిగింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ నీలాంటి కమెడియన్లకు, ఆర్టిస్టులకు ఇక మూడినట్టే అంటూ కామెంట్ పెట్టడంపై కెన్నెత్ ఆగ్రహం చెందారు. ఓ అడుగు దిగజారి ఓ బూతు (తేరి మా రండీ) పదాన్ని వాడారు.

    నెటిజన్‌ను ఉద్దేశించి బూతులు

    నెటిజన్‌ను ఉద్దేశించి బూతులు

    తనపై కామెంట్ చేసిన నెటిజన్‌ను కోపగించుకొంటూ వాడకూడని ఓ బూతు మాటను వాడారు. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆ తర్వాత పరిస్థితి చేజారిందనే విషయం తెలుసుకొన్న తర్వాత తన కామెంట్‌పై వివరణ ఇస్తూ.. అలాంటి మాటను నేను అనలేదు అని అన్నారు. అయితే ఆయన చాటింగ్‌ను వీడియో తీసి నీవు అసలు రూపం ఇదేనంటూ మండిపడుతున్నారు.

    తప్పుడు స్క్రీన్ షాట్లతో

    తప్పుడు స్క్రీన్ షాట్లతో

    నేను బూతులు వాడానని కొందరు తప్పుడు, నకిలీ స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నా మతాన్ని ఉద్దేశించిన నన్ను తిడుతున్నారు. నేను ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ వ్యవహారంపై పోలీసులే వాస్తవాలు చెబుతారు అని కెన్నీ ఓ ట్వీట్ చేశారు.

    నెటిజన్ల ఆగ్రహం.. ట్విట్టర్‌లో ట్రెండింగ్

    నెటిజన్ల ఆగ్రహం.. ట్విట్టర్‌లో ట్రెండింగ్

    అయితే కెన్నిత్ సెబాస్టియన్ తన వంతుగా డిఫెన్స్‌లో ఉంటే.. నెటిజన్లు మాత్రం మెట్టు దిగడం లేదు. ఏది ఏమైనా కెన్నిత్ అరెస్ట్ తప్పదు.. ఆయన అరెస్ట్ కాకుండా ఉండాలంటే మానవీయ కోణమే ఇక ముందున్నది. ఆయన గర్బం దాల్చితే తప్ప అరెస్ట్ కాకుండా ఉండలేరు అంటూ ట్వీట్లతో సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం #KennySebastianGetPregnant అనే ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Comedian Kenny Sebastian in trouble after abusive comment in Social Media. Kenny reacted that, So some fake screenshots of me are circulating where I appear to be abusing people. These are manipulated cause I reported an account who was attacking me cause of my religion.I will be approaching the MumbaiPolice to get this investigated. Please don’t pay heed to any of these.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X