కమెడియన్ అత్యాచారం చేశాడంటూ యువతి ఆరోపణలు.. ఏం జరిగిందంటే?
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా... లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలు ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా సినీ పరిశ్రమలో ఒక సినీ నటుడు తనపై అత్యాచారం చేసినట్లుగా ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
సదరు నటుడు తెలుగు నటుడు కాదు. బాలీవుడ్ పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్ కయాలి సహారా. కామెడీ సర్కస్ ద్వారా అతను మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఆయన మీద రేప్ కేసు నమోదయింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒక యువతి కమెడియన్ కయాలి సహారా తనమీద రేప్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఇద్దరు యువతులు తమకు ఉద్యోగం కావాలని కమెడియన్ సహారా వద్దకు వెళ్ళగా తప్పకుండా ఉద్యోగ అవకాశము కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఉద్యోగం గురించి మాట్లాడాలని చెబుతూ వారి సర్టిఫికెట్స్ తీసుకొని తను చెప్పిన హోటల్కి రావాల్సిందిగా యువతలకు ఫోన్ చేశాడని యువతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టు వారు సర్టిఫికెట్స్ తీసుకుని... అతని హోటల్ కి వెళ్ళారు.
అప్పటికే ఆ యువతుల మీద కన్నేసిన సదరు కమెడియన్ రెండు గదులు బుక్ చేశాడని.. ఆ ఇద్దరి యువతలకు ఒక గదిలో ఉంచి తాను మరో గదిలో ఉన్నాడని అయితే వారితో మాట్లాడాలని చెప్పి వారి గదిలోకి మద్యం తీసుకువెళ్లాడని చెబుతున్నారు. అప్పటికే మద్యం సేవించడమే కాదు వారిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశాడని భయాందోళనకు గురైన ఒక యువతి అక్కడి నుంచి పారిపోయిందని తెలుస్తోంది. అక్కడే ఉన్న మరో యువతి మీద సదరు కమెడియన్ అత్యాచారం చేశాడని అయితే ఆ తర్వాత తప్పించుకున్న యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఇక ఆ కమెడియన్ ఖయాలీ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక వ్యక్తి అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











