Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తమిళ సినిమాకు షారుక్ గ్రీన్ సిగ్నల్.. అజిత్, విజయ్‌పై బాద్షా కామెంట్
బాలీవుడ్ బాద్షా ఒకప్పుడు బాక్సాఫీస్‌ను గడగడలాడించాడు. అయితే కొన్నేళ్ల నుంచి షారుక్ ఖాన్‌కు హిట్టులేక వెనబడ్డాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ షారుఖ్ చూసిన చివరి విజయం. ఆ తరువాత నుంచి ఎన్ని సినిమాలు చేసిన చేతులు కాలాయి తప్పా హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.
గతేడాది ‘జీరో'గా మిగిలిపోయాడు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో' సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకూడా ఫెయిల్ కావడంతో షారుక్ బాగానే అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిగా సినిమాలు మానేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజాగా ఆన్లైన్లో చాట్..
దసరా రోజున షారుక్ తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ‘ఆస్క్ ఎస్ఆర్కే' సెషన్లో పలు రకాల ప్రశ్నలను అడిగారు నెటిజన్లు. దీనిలో భాగంగా తమిళ అభిమానలు విజయ్ గురించి ఒక్కమాటలో చెప్పమన్నారు. అసమ్ అంటూ వారికి బదులిచ్చాడు. అలాగే అజిత్ గురించి చెప్పమని అడగ్గా.. తను నా ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చాడు. తమిళంలో ఓ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. నాకు లాంగ్వేజ్ మీద పట్టుంది.. చేస్తాను అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ధూమ్ 4లో షారుక్..
‘మీరు ధూమ్ 4 సినిమాకు సంతకం చేశారా?' అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘ఇది నేను కూడా విన్నాను... మీకు ఇంకేమైనా వివరాలు తెలిస్తే నాకు ఇవ్వండి' అంటూ బదులిచ్చారు. ఎంతో మంది అభిమానులు తమకు రిప్లై ఇవ్వడం లేదంటూ బాధపడ్డారు.