‘జీరో’ వివాదం: షారుక్ ఖాన్ మీద కంప్లయింట్
షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'జీరో' వివాదంలో చిక్కుకుంది. నవంబర్ 2న షారుక్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదలవ్వగా ఇందులోని ఓ సీన్ తమ మనో భావాలను దెబ్బతీసిందంటూ సిక్కు మతస్తులు ఆందోళనకు దిగారు.
ఇందులో ఓ సీన్లో షారుక్ ఖాన్ గాట్రా కిర్పాన్(సిక్కులు ధరించే ఆయుధం)తో కనిపించారు. ఇది తమ మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటూ ఢిల్లీ సిక్కు గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి మన్‌జిందర్ సింగ్ సిర్సా.... హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాట్రా కిర్పాన్ కేవలం సిక్కు మతాన్ని ఆచరించేవారు మాత్రమే ధరించాలని, సినిమాలో షారుక్ ఖాన్ గాట్రా కిర్పాన్ ధరించి కనిపించడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని సిర్సా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై సిబిఎఫ్‌సికి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వెంటనే 'జీరో'లో షారుక్ ఖాన్ గాట్రా కిర్పాన్ ధరించిన సన్నివేశం తొలగించాలని, దీంతో పాటు ఈ సీన్ ఉన్న 'జీరో' ట్రైలర్ వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై 'జీరో' చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న 'జీరో' చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బేనర్లో గౌరీ ఖాన్ నిర్మించారు. షారుక్ ఖాన్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











