ఆలియా ప్రెగ్నెన్సీని వాడుకుంటున్న కండోమ్ కంపెనీ.. సందట్లో సడేమియా!

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని ఒక మహాకవి అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలియదు గానీ కొన్ని కంపెనీల వారు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న విషయాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వాటినే ప్రచార ఆస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత అమూల్ కంపెనీ దేశంలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ తో తమ కంపెనీల ప్రొడక్ట్స్ ను మార్కెటింగ్ చేసుకుంటుంది. గతంలో పుష్ప, RRR సినిమాలు విడుదలైన సమయంలో కూడా మనం ఈ పరిస్థితి గమనించాం. ఇక ఇప్పుడు ఆలియాభట్ గర్భధారణ విషయంలో డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ ఒక అడుగు ముందుకు వేసింది. ఆ వివరాల్లోకి వెళితే

తల్లి కాబోతున్న అలియా

తల్లి కాబోతున్న అలియా

అలియా భట్ - రణబీర్ కపూర్ బాలీవుడ్ లో అత్యంత పాపులారిటీ ఉన్న స్టార్ కపుల్. పెళ్లి కాక ముందు నుంచే వీరి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండేవి. తాజాగా తాను గర్భవతిని అని, తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నామని అలియా సోషల్ మీడియాలో ప్రకటించారు. 29 ఏళ్ల ఆలియా తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి సోనోగ్రఫీ సెషన్లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి మా పాప.. త్వరలో వస్తుంది అని అలియా కామెంట్ ను కూడా జోడించింది.

ఏప్రిల్ 14న

ఏప్రిల్ 14న

ఈ ఫోటోలో అలియా మానిటర్ ని ఆనందంగా చూస్తోంది. ఆ తరువాత ఆలియా... సింహం కుటుంబానికి చెందిన మరొక ఫోటోను పంచుకుంది. అక్కడ సింహం సింహాన్ని తట్టి లేపుతుండగా అందులో సింహం పిల్ల వాటిని చూస్తోంది, అలా నాకు కుటుంబంలోకి మరో చిన్నారి వస్తోంది అంటూ ఆమె ఆసక్తికరంగా ప్రకటించింది. నిజానికి ఏప్రిల్ 14న ముంబైలోని ఆర్కే హౌస్ లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటన

రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటన

అంటే సరిగ్గా రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటన వెలువడింది. గర్భధారణ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఈ జంటను అభినందించగా ఒక కండోమ్ కంపెనీ మాత్రం ఆసక్తికరమైన అభినందన సందేశం అందింది. సదరు కండోమ్ కంపెనీ సోషల్ మీడియాలో మెహ్ ఫిల్ మే తేరీ...హమ్ తోహ్ క్లియర్లీ నహీ ది అంటూ పోస్ట్ చేసింది. పోస్టర్ పై కంగ్రాట్స్ #రణబీర్- అలియా అని రాసి కంగ్రాట్స్ కూడా చెప్పింది.

టైమింగ్ చూసి

టైమింగ్ చూసి

అయితే సోషల్ మీడియాలో చాలా ఫాస్టెస్ట్ థింగ్స్ విషయంలో అలియాభట్ ప్రెగ్నెన్సీ కూడా నిలుస్తుంది అంటూ ట్రోలింగ్ జరుగుతున్న క్రమంలో గర్భధారణను నివారించే కండోమ్ కంపెనీ ఇలా తెలివైన టైమింగ్ తో ఇలా ప్రచారానికి దిగిందని అంటున్నారు. తెలివైన మార్కెటింగ్ ఐడియాతో ఒక్కసారిగా కంపెనీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక అలియా భట్ - రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర కోసం మొట్ట మొదటి సారి కలిసి నటించారు.

పాన్ ఇండియా సినిమా

పాన్ ఇండియా సినిమా

ఈ సినిమా ఐదు భారతీయ భాషలలో పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ భాషలలో సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్- నాగార్జున - మౌని రాయ్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాదిలో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X