సుశాంత్ కోసం పోరాడిన యోధులకు కంగ్రాట్స్.. సుప్రీంకోర్టు తీర్పుపై కంగనా, KRK

రోజురోజుకి దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మరో సంచలన నిర్ణయానికి అభిమానులు సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో భావోద్వేగంతో స్పందిస్తున్నారు. సుశాంత్ కేసును సీబీఐ విచారించాలనే తీర్పుతో కంగనా రనౌత్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు వారి తరహాలో ఇప్పుడే చట్టాలపై మరింత నమ్మకం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మానవత్వం గెలుస్తోంది.. కంగనా

మానవత్వం గెలుస్తోంది.. కంగనా

మానవత్వం తప్పకుండా గెలుస్తుందని అనుకుంటున్నా , ఇన్ని రోజులు సుశాంత్ సింగ్ కి న్యాయం జరగాలని యోధుల మాదిరిగా పోరాడిన ప్రతి ఒక్కరికి అభినందనలు, మొదటిసారి సామూహిక స్పృహ యొక్క బలమైన శక్తిని నేను అనుభవించాను, అమేజింగ్.. అంటూ కంగనా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.

యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు: KRK

యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు: KRK

బాలీవుడ్ క్రిటిక్ KRK కూడా చాలా రోజుల తరువాత సుశాంతజ్ సింగ్ కేసుపై స్పంధించారు. కేసును సీబీఐ అప్పగించడం సరైన పరిణామం అంటూ కోర్టు తీర్పుకు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు సుశాంత్ సింగ్ కేసు సీబీఐకి చేరాలని, న్యాయం జరగాలని యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలని అన్నారు.

సత్యమేవ జయతే..

సత్యమేవ జయతే..

సుశాంత్ సన్నిహితుడు శేఖర్ సుమన్ మాట్లాడుతూ.. "మనమందరం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాము. మొదటి రోజు నుంచి కూడా మేము ప్రారంభించిన పోరాటం ప్రపంచ ఉద్యమంగా మారింది. సిబిఐ విచారణ కోసం అడుగుతున్న 1.3 బిలియన్ల మంది ప్రజలు కోరికకు నేటితో ఫలితం దక్కింది. సత్యమేవ జయతే. ఇది న్యాయం యొక్క విజయం, ఇది విశ్వాసం, ఆశ, ప్రజాస్వామ్యం యొక్క విజయం అని వివరణ ఇచ్చారు.

రియా చక్రవర్తికి ఇది ఎదురుదెబ్బ

రియా చక్రవర్తికి ఇది ఎదురుదెబ్బ

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు చాలా మంది సినీ తారలు సుశాంత్ సింగ్ కేసుపై గత కొన్ని రోజులుగా న్యాయం జరగాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇక నేడు సుప్రీమ్ కోర్టు సీబీఐ చేతికి అప్పగించడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా రియా చక్రవర్తికి ఇది ఎదురుదెబ్బ అనేలా కామెంట వస్తున్నాయి. మరి సీబీఐ అధికారులు ఈ కేసులో ఎలాంటి విషయాలను బయటపెడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X