Emergency: ఇందిరా గాంధీ డ్రాకుల్లా? దెయ్యమా? ఎమర్జెన్సీ మూవీ, కంగనపై కాంగ్రెస్ ఫైర్

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నిర్మాతగా, దర్శకురాలిగానే కాకుండా నటిగా కూడా నటించి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమా కొన్ని వివాదాల మధ్య బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సిక్కులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పంజాబ్‌లో అనధికారికంగా నిషేధం విధించడం తెలిసిందే. అయితే తాజాగా కొందరు కాంగ్రెస్ వాదులు కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఎమర్జెన్సీ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందిరా గాంధీ యవ్వనంలో తన తండ్రి నెహ్రూ నుంచి రాజకీయ వారసత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వాదుల నుంచే ఎదురైన సవాళ్ల మధ్య కథ సాగుతుంది. పాకిస్థాన్, ఈస్ట్ పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో ఇందిరా తనదైన రాజకీయ వ్యూహాన్ని రచించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు తన సహకారం ఇవ్వడంతో ఆమె పేరు మార్మోగిపోతుంది.

Congress cadre fire on Kangana Ranaut showing Indira Gandhi Disrespectful in Emergency

అయితే దేశంలో నెలకొన్న కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి, అలాగే కార్మికుల సమ్మెను అడ్డుకోవడానికి, జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమాన్ని నిలువరించడానికి తీసుకొన్న ఎమర్జెన్సీ నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. లక్షలాది మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసి జైల్లో పడేయడంతోపాటు పత్రికలపై కూడా ఆంక్షలు విధిస్తుంది.

అయితే ఎమర్జెన్సీ విధించిన తర్వాత కొన్ని నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇందిరా ఆత్మసంరక్షణలో పడిపోతుంది. ఆ సమయంలో కొన్ని సీన్లను ఇందిరాను ఉద్దేశించి కంగన అభ్యంతరకరంగా చిత్రీకరించారనే విషయంపై కాంగ్రెస్ వాదులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సీన్లలో ఇందిరా తనను తాను అద్దంలో చూసుకొంటే.. డ్రాకుల్లా, దెయ్యంలా కనిపించినట్ట చిత్రీకరించడం మాజీ ప్రధాని వ్యక్తిత్వ హననం కిందకు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

దేశానికి ప్రధానిగా వ్యవహరించిన ఇందిరా.. ముఖ్యంగా మహిళా ప్రధానిని కించపరిచే విధంగా సన్నివేశాలను సినిమాలో పెట్టడంపై కాంగ్రెస్ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలు చేసినా.. సిద్దాంత పరంగా లోపాలను ఎత్తి చూపితే పర్వాలేదు. కానీ ఇలా కించపరిచే విధంగా చూపించడం సబబు కాదని పేర్కొంటున్నారు.

Congress cadre fire on Kangana Ranaut showing Indira Gandhi Disrespectful in Emergency

ఇదిలా ఉండగా, పంజాబ్‌లో ఎమర్జెన్సీ సినిమాపై అనధికార బ్యాన్ విధించడంపై కంగన తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తూ నిరాశను వ్యక్తం చేశారు. తన సినిమాను అడ్డుకోవడంపై బాధను వ్యక్తం చేశారు. సిక్కుల నిర్ణయం తనను బాధించింది. సాధారణంగా పంజాబ్‌లో బాగా చూస్తారు. అలాగే సిక్కు ప్రాబల్యం ఉన్న కెనడా, బ్రిటన్‌లో ఎమర్జెన్సీ థియేటర్లపై దాడులు జరిగినట్టు వార్తలు అందాయి అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X