Janhvi Kapoor, సారా, భూమీ పడ్నేకర్‌కు గ్యాంగ్‌స్టర్ వల.. అలాంటి గిఫ్టులతో ఎరవేసి.. ఈడీ విచారణలో సంచలన విషయాలు

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరస్థుడు సుకేష్ చంద్రశేఖరన్‌కు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా ముంబై పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ తారలు నోరా ఫతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను విలువైన గిఫ్టులు, కార్లు, డబ్బుతో తన బుట్టలో పడేసుకొన్న సుకేష్ చంద్రశేఖరన్ మరో ముగ్గురు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌కు బహుమతులు ఎర వేసినట్టు వెల్లడైంది. ఆ వివరాల్లోకి వెళితే..

రాన్ బాక్సీ ప్రమోటర్స్‌ను బెదిరించి

రాన్ బాక్సీ ప్రమోటర్స్‌ను బెదిరించి

సుకేష్ చంద్రశేఖర్ దందాల విషయానికి వెళితే.. ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ ప్రమోటర్ అదితి సింగ్ బెదిరించి.. ఆమె నుంచి 215 కోట్ల రూపాయలను గుంజేందుకు ప్రయత్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతినిధి అని, న్యాయశాఖ కార్యదర్శిని, పీఎంవోలో కీలక అధికారిని అంటూ సుకేష్ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసే వాడనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. అదితి సింగ్‌కు ఫోన్ చేసి నీ భర్త అరెస్ట్ కాకుండా ఉండాలంటే.. 2015 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం అతడిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించడం తెలిసిందే.

నోరా ఫతేహి, జాక్వలైన్‌కు ఖరీదైన గిఫ్టులు

నోరా ఫతేహి, జాక్వలైన్‌కు ఖరీదైన గిఫ్టులు

బాలీవుడ్ శృంగార తార నోరా ఫతేహికి విలాసవంతమైన కారును బహుకరించాడు. అలాగే జాక్వలైన్‌కు కూడా కోట్లాది రూపాయల విలువైన గిఫ్టులను ఇచ్చారు. ముఖ్యంగా జాక్వలైన్‌కు వందల కోట్ల రూపాయలతో ఇంటిని, బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారని, అలాగే 52 లక్షలు విలువ చేసే మేలుజాతి అరబిక్ గుర్రాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చారు. అంతేకాకుండా 9 లక్షలు విలువ చేసే ఫర్షియా పిల్లిని కూడా బహుమతిగా అందించారు. తీహార్ జైలు నుంచి జాక్వలైన్‌ ఫెర్నాండేజ్, నోరా ఫతేహితో పలుమార్లు సుఖేష్ ఫోన్‌లో సంభాషించినట్టు కాల్ డేటా స్పష్టం చేసింది.

సారా, జాన్వీ, భూమి పడ్నేకర్‌కు వల

సారా, జాన్వీ, భూమి పడ్నేకర్‌కు వల

జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి మాత్రమే కాకుండా బాలీవుడ్ అగ్ర తారలు సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్‌లకు ఖరీదైన గిఫ్టులను ఎరవేసి బుట్ట వేసుకోనేందుకు ప్రయత్నించారు అనే విషయం తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు వెల్లడించడంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వారికి విలువైన బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించారని అధికారులు పేర్కొన్నాడు.

యువతిని సీఈవోగా పెట్టుకొని

యువతిని సీఈవోగా పెట్టుకొని

ఈడీ అధికారులు నివేదిక ప్రకారం.. 2021 మే నెలలో సారా ఆలీ ఖాన్‌ను టార్గెట్ చేశారు. సినీ తారలను బుట్టలో వేసుకోవడానికి పింకీ ఇరానీ అనే యువతిని సీఈవోగా పెట్టుకొన్నారు. సినీతారలతో పరిచయం పెంచుకొని సుకేష్‌తో రిలేషన్ కలిపే విధంగా ఆమెకు బాధ్యతలు అప్పగించాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ను సుకేష్‌కు ఇరానీ పరిచయం చేశారు. ఆ తర్వాత మే 21వ తేదీన వాట్సప్‌లో తనను తాను సూరజ్ రెడ్డి అని పరిచయం చేసుకొని మీతో స్నేహం చేయాలని అనుకొంటున్నానని వాట్సాప్‌లో సుకేష్ మెసేజ్ పంపారు. ఆ తర్వాత మన స్నేహానికి గుర్తుగా మీకు నేను ఖరీదైన కారును బహుకరించాలని అనుకొంటున్నాను. నా సీఈవో ఇరానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని చెప్పారు.

సారా ఆలీ ఖాన్‌తో సూరజ్ రెడ్డిగా పరిచయం చేసుకొంటూ..

సారా ఆలీ ఖాన్‌తో సూరజ్ రెడ్డిగా పరిచయం చేసుకొంటూ..

అయితే సూరజ్ రెడ్డిగా పరిచయం పెంచుకొని సారా ఆలీ ఖాన్‌కు సుకేష్ భారీగా, ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చారు. ఈ వ్యవహారంలో సుకేష్ ఇచ్చిన బహుమతుల గురించి ఈడీ అధికారులు 2022 జనవరి 14న సారాను ప్రశ్నించారు. అయితే సుకేష్ పంపిన గిఫ్టులను తాను నిరాకరించినట్టు స్పష్టం చేశారు. ఓ సారి చాక్లెట్స్ పంపారు. మరోసారి ఫ్రాంక్ ముల్లర్ వాచ్ను బహుకరించారు. తనతో స్నేహం చేయాలని చెబితే.. అందుకు నిరాకరించాను అని సారా అధికారులకు వివరించినట్టు సమాచారం.

జాన్వీ కపూర్‌ను బుట్టలోకి ఇలా..

జాన్వీ కపూర్‌ను బుట్టలోకి ఇలా..


ఇక జాన్వీ కపూర్‌ను కూడా సుకేష్ వదల్లేదు. జాన్వీని బుట్టలో దించేందుకు భార్య లీనా మారియా పాల్‌ను రంగంలోకి దించాడు. బెంగళూరులోని సెలూన్ ఓనర్‌గా పరిచయం చేసుకొని 2021లో జూలైలో పరిచయం చేసుకొన్నారు. తన సెలూన్‌ ఒపెనింగ్‌కు ఆహ్వానించారు. సుకేష్, లీనా గురించి తెలియక సెలూన్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ సమయంలో అదితి సింగ్‌ నుంచి అక్రమంగా సంపాదించిన డబ్బు నుంచి తన భార్య ద్వారా 18 లక్షలతోపాటు క్రిస్టియాన్ డియోర్ టోటే బ్యాగ్‌ లాంటి విలువైన గిఫ్టులను జాన్వీకి పంపాడు. ఈ వ్యవహారంలో ఈడి ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ తన బ్యాంక్ అకౌంట్ వివరాలను, స్టేట్‌మెంట్‌ను అధికారులకు అప్పగించారు.

Recommended Video

SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
భూమి పడ్నేకర్‌తో ప్లాన్ ఇలా..

భూమి పడ్నేకర్‌తో ప్లాన్ ఇలా..

బాలీవుడ్ యువ హీరోయిన్ భూమి పడ్నేకర్‌ను కూడా సుకేష్ చంద్రశేఖర్ వదల్లేదు. న్యూస్ ఎక్స్‌ప్రెస్ పోస్ట్ అనే సంస్థ వైస్ ప్రసిడెంట్‌గా పింకి ఇరానీ పరిచయం చేసుకొన్నది. మా సంస్థ చైర్మన్ సూరజ్ ఓ పెద్ద ప్రాజెక్ట్ గురించి మీతో మాట్లాడాలని అనుకొంటున్నారు. అదే సమయంలో మీకు ఓ కారును కూడా బహుమతిగా ఇవ్వాలని అనుకొంటున్నాడు అని పింకి చెప్పింది. మరుసటి రోజున శేఖర్ పేరుతో పరిచయం చేసుకొని పింకీ ఇరానీ చెప్పిన విషయాలను మరోసారి గుర్తు చేశాడు. ఆ తర్వాత సూరజ్ పేరుతో మళ్లీ కాల్ చేసి పరిచయం చేసుకొన్నాడు. అయితే ఈ వ్యవహారంపై భూమీ పడ్నేకర్‌ను విచారించగా.. సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఎలాంటి బహుమతులు స్వీకరించలేదు అని స్పష్టం చేసింది. ఇలా జాన్వీకపూర్, సారా ఆలీ ఖాన్, భూమి పడ్నేకర్‌ను బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నించాడనే విషయాన్ని ఈడీ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X