భర్త అలాంటి వాడైతే పెళ్లి చేసుకొంటా.. కంగన వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్
సినీ పరిశ్రమల్లో అందరి జీవితాలు ఒకేలా ఉండవు.. తెరపై ఎంత ఆనందంగా ఆహ్లాదంగా కనిపించినప్పటికీ ప్రతీ హీరో హీరోయిన్ కి తమ పర్శనల్ స్పేస్ లో ఏదొక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇలా పర్శనల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుంటే వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పాలి. కాంట్రవర్సీ లకు దూరంగా ఫ్యామిలీకి ఆనందానికి దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే సినిమా సినిమాకి ఏదొక కాంట్రవర్సీతో వైరల్ గా వినిపించే నటీనటులు కూడా ఉంటారు.
మరి ఇలా బాలీవుడ్ సినిమా దగ్గర ఓ సంచలన బ్యూటీ ఉంది. తెలుగు సినిమాలో పరిచయం అయ్యినప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యిపోయిన ఈ నిత్య కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ చేసిన రీసెంట్ కామెంట్స్ కొన్ని వైరల్ గా వినిపిస్తున్నాయి. కాగా కంగనా రీసెంట్ గానే బాలీవుడ్ పెద్దల విషయంలో చేసిన పలు సంచలన కామెంట్స్ వైరల్ గా మారగా ఇప్పుడు అసలు పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇది వరకే బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో డేటింగ్ బ్రేకప్ లు కూడా చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఎక్కువ కాంట్రవర్సీ లలో ఉండడంతో చాలా మంది ఈమె పెళ్ళికి దూరం అయ్యిపోయింది అని అనుకోవచ్చు. కానీ పెళ్లి విషయంలో కానీ తన జీవిత భాగస్వామి విషయంలో కానీ మరో ఆలోచనతో కంగనా ఉందని చెప్పాలి. కాగా ఇటీవల కావాలి అనే ప్రశ్నకి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ఇప్పుడు ఈమె సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలో ఉండేవాడు భర్తగా కావాలా లేక రాజకీయాల్లో ఉండేవాడు కావాలా అనే ప్రశ్నకి కంగనా ఈ రకంగా స్పందించింది. తనకి పెళ్లి విషయంలో ఎలాంటి చేదు అభిప్రాయం లేదని తప్పకుండ ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలని ఆమె తెలిపింది. కాకపోతే తనపై చాలా నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది సపోజ్ నేను పెళ్లి చేసుకున్నాక నాకు నోటీసులు లాంటివి వస్తే నా అత్తమామలు నాతో ఉండగలరా అంటూ సమాధానం ఇచ్చింది.

అందుకే ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని అసలు విషయం బయట పెట్టింది. అంతే కాకుండా ప్రతీ ఒక్కరికి ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి అని పిల్లలు ఒక కుటుంబం ఉండాలని కంగనా కామెంట్స్ చేసింది. సో కంగనా ప్రస్తుతానికి పెళ్లి విషయంలో ఎలాంటి నెగిటివ్ ఉద్దేశంలో లేదని చెప్పాలి. మరి కాంట్రవర్సీలను తట్టుకునే లైఫ్ పార్ట్నర్ ని ఎలా ఎంచుకుంటుందో చూడాలి మరి.
కాగా ఇప్పుడు ఈమె నటించిన హిందీ చిత్రం "ఎమర్జన్సీ" కూడా రిలీజ్ కి వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున నెగిటివిటీ ఎదుర్కొంటుంది. కాగా ఈ చిత్రాన్ని స్వయంగా కంగనా రనౌతే దర్శకత్వం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 6న న విడుదలకి రాబోతుంది. సో ఇలా రెండు సినిమాలు నాలుగు కాంట్రవర్సీ లతో కంగనా ఫుల్ బిజీగా ఉందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











