»   » మా ఇండస్ట్రీని కలుషితం చేయొద్దు: అమీర్ ‘మహాభారతం’ వివాదంపై ప్రముఖ రచయిత!

మా ఇండస్ట్రీని కలుషితం చేయొద్దు: అమీర్ ‘మహాభారతం’ వివాదంపై ప్రముఖ రచయిత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aamir Khan's Mahabharat Controversy : Javed Akhtar's Response

భారతీయ సినిమా పరిశ్రమను మతం పేరుతో వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్న సంకుచిత ఆలోచనాపరులపై ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండి పడ్డారు. అలా ప్రయత్నాలు చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ ఇండియన్ సినీ పరిశ్రమ సెక్యూలరిజానికి కోటలాంది అని వ్యాఖ్యానించారు.

వివాదం ఏమిటంటే...

వివాదం ఏమిటంటే...

రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘మహాభారతం' సినిమా రావడంపై... ఇండియన్ బేస్డ్ ఫ్రెంచి జర్నలిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అయిన అమీర్ ఖాన్... హిందువులు పూజించే కృష్టుడి పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.... అతడికి కౌంటర్‌గా జావేద్ అక్తర్ ఈ కామెంట్స్ చేశారు. గ్వాటియర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

53 ఏళ్ల కెరీరర్లో ఎప్పుడూ చూడలేదు

53 ఏళ్ల కెరీరర్లో ఎప్పుడూ చూడలేదు

సినిమా రంగంలో మత విశ్వాసం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఈ సందర్భంగా అక్తర్ కోరారు. 1965లో నెలకు రూ. 50 జీతానికి తాను ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. నా 53 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ మతపరమైన సంఘటనలు ఎప్పుడూ ఎదుర్కోలేదు, అలాంటివి ఎప్పుడూ ఇండస్ట్రీలో చూడలేదు అని జావేద్ అక్తర్ అన్నారు.

మా ఇండస్ట్రీని కలుషితం చేయవద్దు

మా ఇండస్ట్రీని కలుషితం చేయవద్దు

భారతీయ చిత్ర పరిశ్రమ లౌకిక వాదానికి పెట్టని కోటలాంటిది. ఇలాంటి ఇండస్ట్రీని మతాల పేరుతో కలుషితం చేయవద్దు అని... సంకుచిత వాదులను జావేద్ అక్తర్ హెచ్చరించారు.

 ఫ్రాంకోయిస్ గ్వాటియర్ వివాదాస్పద ట్వీట్

ఫ్రాంకోయిస్ గ్వాటియర్ వివాదాస్పద ట్వీట్

ఫ్రాన్స్ కు చెందిన కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్ ఒక ముస్లిం. ఆయన మహాభారతాన్ని తెరకెక్కించడమేంటి..? నటించడమేంటి..? మహ్మద్ ప్రవక్త పాత్రలో ఒక హిందువు నటిస్తే, అందుకు ముస్లిం మతస్థులు ఒప్పుకుంటారా..?" అంటూ రెచ్చగొట్టే తరహాలో ట్వీట్ చేశారు గ్వాటియర్.

ఏ విదేశీ ఏజెన్సీ మీకు డబ్బులిస్తోంది..?

ఏ విదేశీ ఏజెన్సీ మీకు డబ్బులిస్తోంది..?

ఫ్రాన్స్ కు చెందిన దర్శకుడు పీటర్ బ్రూక్స్ ది మహాభారత్ ను తెరకెక్కించారు కదా...ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేయమని ఏ విదేశీ ఏజెన్సీ మీకు డబ్బులిస్తోంది..? అంటూ అక్తర్ ఫ్రాంకోయిస్ ఇంతకు ముందు ఓ ట్వీట్లో ఘాటుగానే స్పందించారు.

ముఖేష్ అంబానీ నిర్మాత

ముఖేష్ అంబానీ నిర్మాత

మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అమీర్ ఖాన్ గతంలో వెల్లడించారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ముఖేష్ అంబానీ సహనిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం తెరకెక్కబోతోందని ఓ బాలీవుడ్ పత్రిక పేర్కొంది.

ఒక్కదాంట్లో అసాధ్యం

ఒక్కదాంట్లో అసాధ్యం

మహాభారతాన్ని ఒకే పార్టులో తీయడం అసాధ్యం. ఇందులో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అందుకే దీన్ని మూడు నుండి ఐదు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని టాక్. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Veteran screenwriter Javed Akhtar today warned "bigots" to be wary of communalising the Indian film industry, which he termed as "the citadel of secularism". The 73-year-old lyricist-writer's comments come after India-based French journalist Francois Gautier had responded to reports of a planned on-screen adaptation of Mahabharat, in which Aamir Khan could possibly play Krishna, highlighting the Bollywood star's religion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X